Begin typing your search above and press return to search.

2026 వ‌ర‌కూ బాల‌య్య హౌస్ ఫుల్!

న‌ట‌సింహ బాల‌కృష్ణ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్ లో క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Oct 2023 1:30 PM GMT
2026 వ‌ర‌కూ బాల‌య్య హౌస్ ఫుల్!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. సీనియ‌ర్ హీరోల్లో బాల‌య్య ఫుల్ స్వింగ్ లో క‌నిపిస్తున్నారు. వ‌రుస‌గా విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. `అఖండ‌`..`వీర సింహారెడ్డి`...` భ‌గ‌వంత కేస‌రి`తో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు బాల‌య్య అగ్ర ప‌ధాన కూర్చ‌బెట్టాయి. దీంతో ద‌ర్శ‌కులంతా బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు. యంగ్ డైరెక్ట‌ర్ల నుంచి సీనియ‌ర్ డైరెక్ట‌ర్ల వ‌ర‌కూ అంతా బాల‌య్య జపం చేస్తున్నారు.

కానీ బాల‌య్య మాత్రం 2026వ‌ర‌కూ మ‌రే ద‌ర్శ‌కుడికి డేట్లు కేటాయించే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. మూడేళ్ల పాటు ఏ ద‌ర్శ‌కుడు బాల‌య్య వైపు చూసేలా కూడా ఛాన్స్ ఇవ్వ‌డం లేదు. ఎందుకంటే మూడేళ్ల డైరీ నిండిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో బాబి తో ఓ సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. ఇది గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో సాగే స్టోరీ అని స‌మాచారం. బాబి కూడా తిరుగులేని మేక‌ర్. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు చేయ‌డం ఆయ‌న‌కు కొట్టిన పిండి.

ఈ సినిమా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. అటు పై వెంట‌నే బాల‌య్య ...సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తారు. దీన్ని దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రిలీజ్ ఏంటి? అన్న‌ది ఇప్పుడే క్లారిటీ గా చెప్ప‌లేం. అటుపై గోపీచంద్ మ‌లినేని..అనీల్ రావిపూడి..బోయ‌పాటి శ్రీను లాంటి హిట్ ఇచ్చిన దర్శ‌కుల్ని బాల‌య్య మ‌ళ్లీ రిపీట్ చేయ‌నున్నారు. ఈ షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే బాల‌య్య 2026 వ‌ర‌కూ వీళ్ల‌కు త‌ప్ప ఇంకే ద‌ర్శ‌కుడికి డేట్లు కేటాయించ‌లేని స‌న్నివేశం క‌నిపిస్తుంది.

100 కోట్లు మార్కెట్ ఉన్నా హీరో బాల‌య్య‌. ఆయ‌న‌తో సినిమా అంటే త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్త‌వుతుంది. బాల‌య్య పారితోషికం కూడా పెద్ద‌గా డిమాండ్ చేయ‌రు. 20 కోట్ల లోపే ఆయ‌న తీసుకుంటారు. ఆయ‌న పూర్తిగా నిర్మాత‌ల హీరో. ద‌ర్శ‌కుల‌కు అనుగుణంగా ప‌నిచేస్తారు. ఇలా కొన్ని లెక్క‌లు చాలా మంది మేక‌ర్స్ ని బాల‌య్య వైపు తీసుకెళ్తున్నాయి. స‌రైన క‌థ ప‌ట్టుకుని వెళ్తే త‌క్కువ బ‌డ్జెట్ లోనే సినిమా చేసి రిలీజ్ చేయోచ్చు అన్న‌ది చాలా మంది ఆలోచ‌న‌. కానీ బాల‌య్య డేట్లు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైన ప‌ని.