బాలూలో ఘంటసాలను చూసుకున్న రామోజీ.. ఈ విషయాలు తెలుసా!?
మీడియా మొఘల్‌గా తనకంటే ప్రత్యేకతను చాటుకున్న చెరుకూరి రామోజీరావు.. సంగీత పిపాసి.
By: Tupaki Desk | 8 Jun 2024 3:30 PM GMTమీడియా మొఘల్‌గా తనకంటే ప్రత్యేకతను చాటుకున్న చెరుకూరి రామోజీరావు.. సంగీత పిపాసి. ఆయనకు సంగీతం అంటే.. ఎనలేని మక్కువ. శ్రావ్యమైన గీతాలే ఆయనకు.. ఎనలేనిశక్తినిస్తాయంటే అతిశయోక్తికాదు.. తెలుగు వారి గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కాలంలో రామోజీ.. సినీ రంగంలోకి రాలేకపోయారు. అయితే.. ఆతర్వాత... బాల సుబ్రహ్మణ్యం హయాంలో మాత్రం.. రామోజీ 20 సినిమాలకు ప్రాణం పోశారు. ప్రతిసినిమాలోనూ శ్రావ్యతకు.. తెలుగు దనానికి పెద్ద పీట వేశారు.
అదేసమయంలో అనేక.. ప్రయోగాలకు కూడా రామోజీ పెట్టింది పేరు. రామోజీ సినిమాలంటే.. సకుటుం బ సపరివార సమేతంగా చూడదగిన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. `మయూరి` సినిమా తీయాలని అనుకున్నప్పుడు.. తొలుత శ్రీదేవిని అనుకున్నారు. కానీ, రామోజీమాత్రం పట్టుబట్టి.. సుధాచంద్రన్‌తోనే ఈ సినిమా చేయించారు. ఆమెకు ప్రత్యేకంగా.. నటనలో శిక్షణ ఇప్పించింది కూడా.. రామోజీరావే. ఈసినిమా.. ఆ రోజుల్లో ఒక ప్రయోగం. సూపర్ సక్సెస్ సాధించింది.
ఇక, ప్రతి సినిమాకు బాలునే గాయకుడు.. కొన్ని సినిమాలకు ఆయనే సంగీత కర్త కూడా. ఇక, సినిమాల్లో బాలు దూసుకుపోతున్న సమయంలోనే `పాడుతా తీయగా` అనే ప్రైమ్ టైం కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఆస్థాన విద్వాంసుడుగా ఆయనను నియమించుకున్నారు. ఘంటసాల లేని లోటును బాలులో రామోజీ చూసుకున్నారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పిన బాలు.. రామోజీ తనకు అవకాశం ఇవ్వకపోయి నా.. పాడుతా.. తీయగా అనే కాన్సెప్టు ను ఆయన తీసుకురాకపోయినా.. తన పేరు ఈ రేంజ్‌లో తెలిసే అవకాశం లేకుండా పోయేదని చెప్పుకొచ్చారు.
తెలుగు పాట శ్రావ్యతను నేటి తరానికి పరిచయం చేయడమే కాదు.. పదుల సంఖ్యలో తెలుగు సినీ రంగా నికి గాయకులను, సంగీతదర్శకులను కూడా.. అందించింది.. పాడుతా తీయగా. రామోజీ విషయా నికి వస్తే.. ఎక్కువ మంది ఈ విషయాన్ని విస్మరిస్తారు. కానీ, ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. నేడు ఎం.ఎం. కీరవాణి వంటి దిగ్గజ సంగీత దర్శకుడికి ఒకప్పుడు అవకాశాలు రాలేదు. నువ్వు కూడానా.. అంటూ..తిరిగి పంపించేసిన క్షణాల్లో రామోజీ రావు.. కీరవాణికి తొలి అవకాశం ఇచ్చారు. అంతే.. ఆయన ఆస్కార్ అంత ఎత్తుకు ఎదిగారు. సంగీత ప్రపంచంలో రామోజీ పాత్ర అనన్యసామాన్యం అనడానికి ఇది చిన్న ఉదాహరణే.