డాకు మహారాజ్:సీనియర్స్ లో బాలయ్య మార్క్ సెన్సేషన్
ముఖ్యంగా బాలయ్య పవర్‌ఫుల్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
By: Tupaki Desk | 14 Jan 2025 6:34 AM GMTనందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు బాబీ పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా బాలయ్య పవర్‌ఫుల్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సంక్రాంతి బరిలో విడుదలైన ఈ చిత్రం, మొదటి నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించింది. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటం, టికెట్ కౌంటర్ల వద్ద అభిమానుల హంగామా ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పవచ్చు. బాలయ్య తన ఎనర్జీ, మాస్ డైలాగులతో ప్రేక్షకులను థియేటర్లకు తిప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. డాకు మహారాజ్ ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది. బాలకృష్ణ వరుసగా నాలుగు చిత్రాలతో ఈ ఫీట్ సాధించిన తొలి సీనియర్ హీరోగా రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించడం వల్ల బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది.
డాకు మహారాజ్తో పాటు, అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు కూడా 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాయి. వరుసగా ఈ స్థాయి విజయాలను అందుకోవడం బాలయ్య కెరీర్‌కు ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఓవర్సీస్‌లోనూ మాస్ సినిమాలకు ఉన్న డిమాండ్‌ను ఈ సినిమాలు రుజువు చేశాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
బాబీ డియోల్ ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్నారు. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్ విజువల్స్ ఈ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. సంక్రాంతి సీజన్‌లో విడుదలైన డాకు మహారాజ్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశముంది. బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైన్‌మెంట్‌కు ఈ సినిమాతో మరోసారి ఫుల్ క్రెడిట్ లభించిందని చెప్పవచ్చు.