Begin typing your search above and press return to search.

బాలయ్య @50 - నెవ్వర్ బిఫోర్ ప్లాన్స్

నటుడిగా బాలకృష్ణ తన 108వ సినిమాని ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 4:02 AM GMT
బాలయ్య @50 - నెవ్వర్ బిఫోర్ ప్లాన్స్
X

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యాక్టర్స్ లలో సుదీర్ఘ సినీ ప్రస్తానం ఉన్న నటులో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు. తాతమ్మ కల సినిమాలో టీనేజ్ కుర్రాడిగా బాలకృష్ణ మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై కనిపించారు. అప్పటి నుంచి నటుడిగా తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. 50 ఏళ్ళల్లో ఎన్నో మరుపురాని పాత్రలని బాలకృష్ణ తన కెరియర్ లో పోషించారు. నటుడిగా బాలకృష్ణ తన 108వ సినిమాని ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.

యాక్షన్ హీరోగా నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇప్పటికి ఏ మాత్రం తగ్గని ఎనర్జీ తో కెమెరా ముందు బాలయ్య యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి పాత్ర ఇచ్చిన దానికి పూర్తిగా న్యాయం చేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ బాలయ్య 50 ఏళ్ళ ప్రస్థానం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుక నిర్వహించడానికి రెడీ అవుతోంది సెప్టెంబర్ 1న ఈ వేడుకని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారంట. అతిరథ మహారధులు అందరూ ఈ ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తోంది

ఈ ఈవెంట్ కి సంబందించిన కర్టన్ రైజర్ కార్యక్రమం తాజాగా FNCC లో జరిగింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు బాలయ్య గురించి మాట్లాడారు, నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ నా తమ్ముడు బాలకృష్ణ నటనలోనే కాకుండా రాజకీయాలలో కూడా మా తండ్రి వారసత్వాన్ని నిలబెడుతున్నాడని కొనియాడారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఇండియాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణ అత్యధిక కాలం నటుడిగా కొనసాగిన వ్యక్తిగా ఉన్నారని అన్నారు.

సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ నేను బాలయ్యతో ఏకంగా 13 సినిమాలు చేసాను. మా ప్రయాణం చాలా కాలం సాగింది. యువతలో కూడా బాలయ్య క్రేజ్ కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. దర్శకులని బాలయ్య చాలా గౌరవం గా చూస్తారని అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ బాలయ్య సినిమాలు అన్ని రికార్డులు క్రియేట్ చేశాయి. అలాగే ఆయన గోల్డెన్ జూబ్లీ వేడుక కూడా రికార్డ్ స్థాయిలో జరగాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ నేను గుడివాడలో తాతమ్మ కల సినిమా చూసాను.

ఎన్టీఆర్ అభిమానిగా బాలకృష్ణ గురించి ఈ రోజు మాట్లాడే రావడం నా అదృష్టంగా భావిస్తాను. 50 ఏళ్ళ బాలయ్య ప్రయాణం అద్భుతం అని కొనియాడారు. స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానిగా మేము ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనతో చండశాశనుడు సినిమా చేస్తున్న సమయంలో ఓ అందమైన కుర్రాడిగా బాలయ్యని చూసాను. ఆ కుర్రాడు 50 ఏళ్ళ సినీ ప్రయాణం పూర్తి చేసుకున్నాడు. ఆయనకి ఒక స్టైల్ ఉంటుంది. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు. ఇండస్ట్రీ మొత్తం బాలయ్య 50 ఏళ్ళ వేడుకని ఘనంగా చేయాలని కోరారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ 50 నిమిషాలు నడిస్తేనే అలసిపోతాం. బాలకృష్ణ 50 ఏళ్ళుగా నటుడిగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయిన ఇప్పటికి అంతే ఎనర్జీతో పెర్ఫార్మ్ చేస్తారు. ఆయన 109వ సినిమాని నేను చేస్తూ ఉండటం గర్వంగా ఉందని అన్నారు.