Begin typing your search above and press return to search.

కండల బలమే ఆయుధంగా.. బాలయ్య కబడ్డీ

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతోనే కాకుండా మరోవైపు రియాలిటీ షోలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 6:32 AM GMT
కండల బలమే ఆయుధంగా.. బాలయ్య కబడ్డీ
X

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతోనే కాకుండా మరోవైపు రియాలిటీ షోలతో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని కమర్షియల్ యాడ్స్ లలో కూడా కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక అప్పుడప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్ కు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా బాలయ్య పాల్గొంటున్నారు. ఇక త్వరలో స్టార్ట్ కాబోతున్న స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ కోసం కూడా ఆయన రంగంలోకి దిగడం విశేషం.

గతంలో రానా దగ్గుబాటి ఈవెంట్ కు ప్రత్యేకంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఈసారి నందమూరి బాలకృష్ణ చేతిలో ఆ బాధ్యతలు పెట్టారు. బాలకృష్ణ ప్రమోషన్ యాడ్స్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఒక స్పెషల్ యాడ్ వీడియో కూడా విడుదల చేశారు. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ కన్నడ నుంచి సుదీప్ ఈ ప్రో కబడ్డీ లీగ్ కోసం యాడ్స్ లో నటించగా తెలుగు నుంచి బాలకృష్ణ మద్దతు ఇస్తున్నారు.

బాలకృష్ణ ఒక వీర యోధుడు తరహాలో కనిపిస్తూ ఉండడం విశేషం. ఆ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ కబడ్డీ ఆటపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కబడ్డీ.. మన మట్టిలో పుట్టిన ఆట.. మన తెలుగువాడి పౌరుషాన్ని తెలిపే ఆట. కండల బలమే ఆయుధంగా.. మైదానమే రణస్థలంగా.. పోరాడే ఈ దమ్మున్న ఆటను అస్సలు మిస్ కావద్దు.. చూడండి అంటూ బాలకృష్ణ వివరణ ఇచ్చారు.

ఇక డిసెంబర్ 2 నుంచి కబడ్డీ లీగ్ స్టార్ట్ కాబోతోంది. ఇక మరోవైపు బాలయ్య బాబు సినిమాల విషయానికొస్తే ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆయన నెక్స్ట్ సినిమాను బాబీ దర్శకత్వంలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవల మొదలైంది. ఈ సినిమా కూడా కంప్లీట్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.