Begin typing your search above and press return to search.

బాలయ్యతో దుల్కర్.. ఎందుకు అలా కనిపిస్తాడా?

మలయాళం ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపుని అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల తమిళ్ తెలుగులో కూడా క్రేజ్ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 11:02 AM GMT
బాలయ్యతో దుల్కర్.. ఎందుకు అలా కనిపిస్తాడా?
X

మలయాళం ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపుని అందుకున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల తమిళ్ తెలుగులో కూడా క్రేజ్ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అతనికి అవకాశాలు వస్తున్నాయి. కానీ తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రీసెంట్గా తెలుగులో అయితే అతనికి మంచి విజయాలు దక్కాయి.

మహానటి సినిమాలో కాస్త నెగిటివ్ షెడ్ ఉన్న పాత్ర చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం సీతారామం అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకున్నాడు. మిగతా భాషల్లో కూడా పరవాలేదు అనే విధంగా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. దీంతో దుల్కర్ సల్మాన్ కు అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగులో కూడా అతను మరింత బిజీ అవుతున్నాడు.

ఇక రీసెంట్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే సీతార ఎంటర్టైర్మెంట్స్ లో బాలకృష్ణ చేస్తున్న NBK 109 సినిమాలో కూడా అతను ఒక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడని టాక్ వచ్చింది. ప్రస్తుతం హీరోగా మంచి అవకాశాలు వస్తున్న సమయంలో బాలయ్య సినిమాలో స్పెషల్ పాత్రలో నటిస్తున్నాడు అంటే ఆ పాత్ర ఎలా ఉంటుంది అనే ఊహాగానాలు గట్టిగానే వస్తున్నాయి.

ఇంతకీ బాలయ్య సినిమాలో దుల్కర్ పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడా లేదంటే బాలయ్య బాబుకు ధీటుగా నెగిటివ్ షెడ్ లో కనిపిస్తాడా అనే విషయంలో ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం అతను బాలయ్య బాబుకు అపోసిట్ గా నటిస్తాడాని తెలుస్తోంది. ఒకవైపు నెగిటివ్ షేడ్ మరొకవైపు పాజిటివ్ కోణం ఉండేవిధంగా దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక పాత్ర గురించి విన్న వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దర్శకుడు బాబి, దుల్కర్ అయితేనే ఆ పాత్రకు సరైన న్యాయం చేయగలడు అని అనుకుంటున్నాడట. ఇక ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి నిజంగా బాలయ్య దుల్కర్ సల్మాన్ కలిసి నటిస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.