Begin typing your search above and press return to search.

బాలయ్య సినిమాలో యంగ్ హీరోనా?

నందమూరి బాలకృష్ణ మొత్తానికి ఈ ఏడాది భగవంత్ కేసరి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 9:29 AM GMT
బాలయ్య సినిమాలో యంగ్ హీరోనా?
X

నందమూరి బాలకృష్ణ మొత్తానికి ఈ ఏడాది భగవంత్ కేసరి సినిమాతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. అంతకుముందు అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య బాబు మెల్లమెల్లగా తన మార్కెట్ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ దసరాకు భగవంత్ కేసరి సినిమాతో కూడా మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక తదుపరి సినిమాలో బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ లో త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చూన్ ఫోర్ కూడా ఒక భాగం కానుంది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక రీసెంట్గా సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం మరొక యువ హీరోను దర్శకుడు రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. దర్శకుడు బాబి ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో చేసిన వాల్తేరు వీరయ్య కూడా ఇదే ఫార్మాట్లో వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు అందులో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే ఇప్పుడు బాబి మళ్ళీ అదే ఫార్మాట్లో బాలయ్య బాబును మెయిన్ హీరోగా చూపిస్తూ మరొక హీరో పాత్ర కోసం మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ను రంగంలోకి దింపుతున్నట్లు టాక్. ఇప్పటికే దుల్కర్ తెలుగులో మహానటి సీతారాం సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు.

పాజిటివ్ అయినా నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలు అయినా అతను పర్ఫెక్ట్ గా చేయగలడు అని నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు బాలయ్య సినిమాలో దర్శకుడు బాబి అతన్ని ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది కొంత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ భాషతో సంబంధం లేకుండా అటు నార్త్ ఇటు సౌత్ లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. మరి ఇప్పుడు బాలకృష్ణ బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అతను ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి.