Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సింగిల్ ఫ్రేమ్‌ లో ముగ్గురు మొనగాళ్లు

స్టేజ్ పై చిరంజీవి ని బాలకృష్ణ హత్తుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   28 Sep 2024 4:00 AM GMT
పిక్ టాక్ : సింగిల్ ఫ్రేమ్‌ లో ముగ్గురు మొనగాళ్లు
X

టాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న ఈ నలుగురు ఒకే స్టేజ్ పై కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. వీరిలో కనీసం ఇద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తే గొప్ప విషయం అన్నట్లుగా ఉంటుంది. అలాంటిది ఒకేసారి ముగ్గురు స్టార్స్ ఒకే వేదిక పై కనిపించి ఫ్యాన్స్ కు కన్నుల విందు చేశారు. తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డు వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతున్నాయి.


స్టేజ్ పై చిరంజీవి ని బాలకృష్ణ హత్తుకున్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నాలుగు దశాబ్దాలుగా పోటీ తత్వ వాతావరణం ఉంది. అయినా ఇద్దరూ ఇలా కలిసిన సమయంలో చాలా సరదాగా గడపడం, మనసు విప్పి మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు. చిరంజీవి, బాలయ్య ల మధ్య విభేదాలు అంటూ వచ్చే వార్తలకు ఇలాంటి ఫోటోలు సమాధానం చెబుతూ ఉంటాయి. వీరిద్దరితో పాటు ఇదే ఫోటోలో వెంకటేష్ సైతం ఉండటంతో ఫ్యాన్స్ కి మరింత కన్నుల విందుగా ఉంది. సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్ల ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఈ ముగ్గురు అవార్డు వేడుక కోసం దుబాయి కి వెళ్లడం జరిగింది. ప్రతిష్టాత్మక ఐఫా అవార్డు వేడుకలో గతంలో పలువురు స్టార్స్ పాల్గొన్నారు. అయితే ఈసారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విధంగా ఈ ముగ్గురు ఫోటోలకు ఫోజ్ లు ఇచ్చారు. ఐఫా అవార్డుల గురించి తెలుగు మీడియా తో పాటు, ప్రేక్షకుల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఐఫా వేడుకలు దుబాయ్ లో వైభవంగా, తారా తోరణం గా సాగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుక లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు పాల్గొనడం వల్ల ఆ వేడుక స్థాయి మరింత పెరిగిందని అభిమానులతో పాటు , ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ముగ్గురు స్టార్‌ హీరోల్లో కనీసం ఇద్దరు అయినా కలిసి సినిమాల్లో నటిస్తే బాగుండు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరు తరచు కలుస్తూ ఉన్నారు. గతంతో పోల్చితే వీరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయి. యంగ్‌ హీరోల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు సీనియర్‌ ల మధ్య లేవు అనే విమర్శలకు ఇలాంటి ఫోటోలు సమాధానంగా నిలుస్తాయి. ముందు ముందు వీరి కలయికలో మరిన్ని ఫోటోలు.. సినిమాలూ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఫోటోలను చూసి సినీ ప్రేమికులు ఫుల్‌ ఫిదా అవుతున్నారు.