Begin typing your search above and press return to search.

బాలయ్య.. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడితోనే..

ముఖ్యంగా బాలయ్యకు తగ్గ మాస్ కథలు ఎన్ని వస్తున్నా కూడా ఆడియెన్స్ మాత్రం బోర్ గా ఫీల్ అవ్వడం లేదని అర్ధమవుతుంది.

By:  Tupaki Desk   |   16 Jan 2025 10:30 AM GMT
బాలయ్య.. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడితోనే..
X

నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా వరుస బాక్సాఫీస్ హిట్స్ తో తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే మరోవైపు అన్ స్టాపబుల్ షోతో కూడా తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. ముఖ్యంగా బాలయ్యకు తగ్గ మాస్ కథలు ఎన్ని వస్తున్నా కూడా ఆడియెన్స్ మాత్రం బోర్ గా ఫీల్ అవ్వడం లేదని అర్ధమవుతుంది. ఇక దర్శకులు కూడా అదే తరహా కాన్సెప్టులతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నారు.

బాలకృష్ణ కెరీర్ కు మరో లెవెల్లో బూస్ట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. సింహా - లెజెండ్ - అఖండ సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరాసింహ రెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే క్లిక్కయ్యింది. రీసెంట్ గా బాబీ తెరకెక్కించిన డాకు మహరాజ్ కూడా అదే రేంజ్ లో సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తోంది.

అయితే బాలకృష్ణ కోసం మరికొందరు దర్శకులు కూడా లైన్ లో ఉన్నారు. అయితే గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తుందనే వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 2023 సంక్రాంతిలో విడుదలైన వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. బాలయ్య మాస్ అటిట్యూడ్, మలినేని స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోందని సమాచారం.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్‌తో జాట్ అనే భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు బాలయ్య అఖండ 2 షూటింగ్‌లో ఉన్నారు, బోయపాటి శ్రీనుతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. జాట్ పూర్తి అయ్యాక మలినేని, అఖండ 2 పూర్తి చేసిన తర్వాత బాలయ్య మరోసారి కలిసి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ సమ్మర్ కు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాతలు ఇంకా నిర్ణయించబడలేదు. రెండు పెద్ద బ్యానర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి, అందులో ఒకటి చెరుకూరి సుధాకర్ బ్యానర్. చెరుకూరి సుధాకర్ మోక్షజ్ఞతో ముందుగా ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతే, సుధాకర్ బాలయ్య మలినేని చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉంది.

అయితే, మోక్షజ్ఞ ముందుకెళ్లితే, ఈ ప్రాజెక్ట్‌ను సతీష్ కిలారు తన వృద్ధి బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం. సతీష్ కిలారు ప్రస్తుతం బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయ్యాక బాలయ్య సినిమాకు సంబంధించి క్లారిటీ ఇవ్వనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.