Begin typing your search above and press return to search.

డాకు అంటే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయా బాసూ!

బాల‌య్య వ‌రుస విజ‌యాలతో డాకు మహారాజు బిజినెస్ ఒప్పందాలు భారీ ఎత్తున జ‌రుగుతున్నాయి. అయితే ఇదొక రివేజ్ స్టోరీ డ్రామా అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2024 4:30 PM GMT
డాకు అంటే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయా బాసూ!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ‌-బాబి ప‌క్కా మాస్ కంటెంట్ తో వ‌స్తున్నార‌న్న‌ది ప‌చ్చి వాస్త‌వం. అందులో ఎలాంటి డౌట్ లేదు. 'డాకు మాహారాజ్' టైటిల్ తోనే పుల్ క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ బాబి చేసిన సినిమాల‌న్నీ అలాంటివే. టాలీవుడ్ లో క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్లు క‌రువైపోతున్నారు? అనుకుంటోన్న స‌మ‌యంలో బాబి దిగి వ‌రుస‌గా స‌క్సస్ లు మీద స‌క్సెస్ లు కొట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు. బాబి గ‌త సినిమా 'వాల్తేరు వీర‌య్య' ఎంత మాస్ హిట్ అయిందో తెలిసిందే. చిరంజీవి మాస్ ఇమేజ్ బాబి మాస్ కంటెంట్ కి క‌నెక్ట్ అవ్వ‌డంతో బాక్సాఫీస్ మోతెక్కింది.

ఇప్పుడు బాల‌య్య 109వ సినిమా విష‌యంలో కూడా అదే రిపీట్ అవుతుంది. బాల‌య్య‌కు ఉన్న మాస్ ఇమేజ్ తోనే జ‌నాల్ని థియేట‌ర్ కి ర‌ప్పించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి 12 న‌ రిలీజ్ అందుకు త‌గ్గ‌ట్టు నిర్మాత‌లు బిజినెస్ ప‌నుల్లోనూ నిమ‌గ్న‌మ‌య్యారు. బాల‌య్య కూడా వ‌రుస స‌క్సెస్ ల మీదు న్నారు. ఇప్ప‌టికే మూడు విజ‌యాల‌తో హ్యాట్రిక్ న‌మోదు చేసారు. దీంతో డ‌బుల్ హ్యాట్రిక్ పై క‌న్నేసి త‌దుప‌ర చిత్రాల లైన‌ప్ ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు.

బాల‌య్య వ‌రుస విజ‌యాలతో డాకు మహారాజు బిజినెస్ ఒప్పందాలు భారీ ఎత్తున జ‌రుగుతున్నాయి. అయితే ఇదొక రివేజ్ స్టోరీ డ్రామా అంటున్నారు. ప్లాష్ బ్యాక్ లో చాందిని చౌద‌రి కి సంబంధించిన ఎపిసోడ్ కీలక పాత్ర పోషిస్తాయ‌ట‌. అప్పుడు బాల‌య్య ఆహార్యం, న‌ట‌న కొత్త కోణంలో ఉంటాయంటున్నారు. బాల‌య్య పోలీస్ పాత్ర అని కూడా వినిపిస్తుంది. ఓ ప్ర‌భుత్వాధికారి విచక్షణ లేకుండా ప్ర‌త్య‌ర్ధుల‌పై దాడి చేసే శ‌క్తివంత‌మైన డాకు అని అంటున్నారు.

ఐదు యాక్ష‌న్ బ్లాక్స్ సినిమాలో హైలైట్ గా ఉంటాయ‌ట‌. బాల‌య్య థియేట‌ర్లో డాకు అంటే ద‌ద్ద‌రిల్లిపోతుంద‌ని అంటున్నారు. థ‌మ‌న్ పాట‌లు, ఆర్ ఆర్ సినిమాని పీక్స్ తీసుకెళ్తాయ‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలాలు హీరోయిన్లుగా నటించారు. బాబి డియోల్ విల‌న్ గా న‌టించారు.