Begin typing your search above and press return to search.

'అఖండ' తాండవం ఎక్కడ..!

లేదంటే బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచేది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2025 10:47 AM IST
అఖండ తాండవం ఎక్కడ..!
X

బాలకృష్ణ మొన్న సంక్రాంతికి 'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కారణంగా డాకు మహారాజ్ వసూళ్లు తగ్గాయి. లేదంటే బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచేది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించలేకపోయినా, బాలయ్య తదుపరి సినిమా 'అఖండ : తాండవం' సినిమా ఆ లోటును భర్తీ చేస్తుందనే విశ్వాసంను నందమూరి ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్ల వసూళ్లను రాబట్టింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు మూడు సినిమాలు వీరి కాంబోలో వచ్చి సూపర్‌ హిట్‌ అయ్యి బ్లాక్‌ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే డబుల్‌ హ్యాట్రిక్‌ అఖండ 2 తో సాధ్యం అంటూ పలువురు ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

డాకు మహారాజ్ విడుదలకు ముందు నుంచే అఖండ 2 పనులు జరుగుతున్నాయి. అఖండ 2 కోసం ఇటీవల జరిగిన మహా కుంభమేళలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారనే విషయం తెల్సిందే. ఆ తర్వాత విజయవాడలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిమాలయాల్లో సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందట. అక్కడ అఘోరాలపై కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. బాలయ్య అఘోరాగా కనిపించే గెటప్‌తో షూటింగ్‌ చేస్తున్నారు. మరో మూడు లేదా నాలుగు రోజుల్లో అక్కడ షూటింగ్‌ను బోయపాటి అండ్ టీం ముగించుకుని వస్తారని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

హిమాలయాల్లో షెడ్యూల్‌ తర్వాత కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో షూటింగ్‌ జరపనున్నట్లు సమాచారం అందుతోంది. అఖండ 2 సినిమా కోసం బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడనే విషయం తెల్సిందే. కర్నూలు షెడ్యూల్‌ లో బాలకృష్ణ రెగ్యులర్ లుక్‌లో కనిపించబోతున్నారు. వరుసగా నాలుగు విజయాలను సొంతం చేసుకున్న బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అఖండ 2 పై సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. కనుక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సనాతన ధర్మ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.