Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కు వ‌య‌సుతో పాటు ప‌వ‌ర్ పెరుగుతుంది!

ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌తో పాటు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు,అభిమానులు హాజ‌ర‌య్యారు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 4:08 AM GMT
బాల‌య్య‌కు వ‌య‌సుతో పాటు ప‌వ‌ర్ పెరుగుతుంది!
X

న‌ట‌సింహ బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా నేడు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఓస్టార్ హోట‌ల్ లో స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌ ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌తో పాటు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు,అభిమానులు హాజ‌ర‌య్యారు.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ..`110 సినిమాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. బాల‌య్య బాబు 50 సంవత్సరాలుగా సినీ ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందిస్తున్నారు. మీకు ఓపిక ఉన్నంత వరుకు, ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు చేయాలి. మేము అంత మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం. అందులో ఉన్నంత ఎనర్జీ ఇంకెక్కాడా ఉండదు.చరిత్రకారులు అరుదుగా పుడతారు. అలా పుట్టిన ఎన్టీఆర్ పుట్టారు. అలాంటి గొప్ప మనిషికి పుట్టి ఆయనలా సేవ, నటన, రాజకీయం నిలబెట్టు కుంటూ వచ్చారు. ఆయన ఎవరు సాయం కోరినా? వారికోసం కచ్చితంగా నిలబడతారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుంది. కానీ బాలయ్యకు పవర్ పెరుగుతుంది.


మ‌రో ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ, ` బాలయ్య బాబు గారి గురించి మాట్లాడ‌టాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే ? అవి అయ‌న బాడీ లాంగ్వేజ్ నుంచే పుడ‌తాయి. నటుడిగా, రాజకీయ నాయకుడుగా, మానవత్వం ఉన్న మనిషిలా ఉండటం ఆయనకే సాధ్యం.ఏపీ సినిమాటోగ్రాఫ‌ర్ కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, ` 50 ఏళ్ల‌గా యావత్ భార‌త‌దేశం కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకు ఆయ‌న‌కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే కొన‌సాగాలి. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి` అని అన్నారు.సీనియ‌ర్ న‌టి సుమలత మాట్లాడుతూ, ` నేను బాలయ్య గారితో 2 సినిమాల్లో నటించాను. ఆయ‌న చాలా సింపుల్ గా ఉంటారు. మనస్పూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి` అని అన్నారు.

కమల్ హాసన్ (వీడియో) లో మాట్లాడుతూ, ` బాల‌కృష్ణ గారు ఎంతో సంస్కార‌వంతులు. అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే. ఆయనే ఎన్టీఆర్ గారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం` అన్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ, ` నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నాన్న గారు, బాలయ్య గారు వల్లే. బాలకృష్ణ గారు చాల అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచమైనది. బాలయ్యా గారు వైద్య రంగంలో చేసినంత సేవ ఇంకెవరు చేయలేదు. ఆయ‌న 100 సంవ‌త్స‌రాల వేడుక కూడా చేసుకోవాలి` అని అన్నారు.


రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ` నేన బాల‌ కృష్ణ గారి సినిమా విడుదల రోజున పుట్టాను. అందుకే ఇలా కొంచం అల్లరి చేస్తూ ఉంటా. జై బాలయ్య` అని అన్నారు.నాని మాట్లాడుతూ, ` నా వయసుకి 10 సంవత్సరాలు ఎక్కువ ఈ మీ 50 ఏళ్ల వేడుకలు. బాలయ్య గారిని ఒకసారి కలిసినా, దగ్గరగా చూసినా వెంటనే ఆయ‌న్ని ఇష్టపడిపోతారు. మీరు ఇలాగే మరో 100 సినిమాలు చేయాలి` అని అన్నారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ` బాలయ్య గారు 50 ఏళ్ల ఇలా నటనా రంగంలో ఉండటం, వైద్య రంగంలో ఇలా సేవ చేయడం మేము చూస్తూనే పెరిగాం. నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ హాస్పటల్ లో చికిత్స పొదారు. నేను తొలిసారి లైగర్ షూటింగ్ లో కలిసాను. మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి` అని అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కూ టి. సుబ్బరామిరెడ్డి, రఘు రామ కృష్ణం రాజు, కె, రాఘవేంద్రరావు, మురళీమోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అశ్వినీదత్‌, సుహాసిని, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌, గోపీచంద్‌, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, తదితరులు పాల్గొన్నారు.