Begin typing your search above and press return to search.

ఆ సినిమా సెట్‌ కి వెళ్లి సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య

వెంకటేష్ తో ఉన్న అనుబంధం ను బాలయ్య ఇలా చూపించాడు అంటూ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Sep 2024 6:55 AM GMT
ఆ సినిమా సెట్‌ కి వెళ్లి సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య
X

నందమూరి బాలకృష్ణ ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో తన NBK109 సినిమా షూటింగ్ కోసం వెళ్లాడు. అదే సమయంలో పక్కన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమా షూటింగ్ జరుగుతుందనే విషయం తెలిసి అక్కడకు వెళ్లి అందరినీ సర్‌ప్రైజ్ చేయడం జరిగింది. బాలయ్య గత చిత్రం భగవంత్ కేసరి సినిమా కు అనిల్ రావిపూడి దర్శకత్వం అనే విషయం తెల్సిందే. ఆ అనుబంధంతోనే అనిల్ ప్రస్తుత సినిమా షూటింగ్‌ స్పాట్‌ కి వెళ్లి మరీ సర్‌ప్రైజ్ చేయడం జరిగింది. వెంకటేష్ తో ఉన్న అనుబంధం ను బాలయ్య ఇలా చూపించాడు అంటూ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

బాలకృష్ణ, వెంకటేష్ లు అరుదుగా కలుస్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకోవడం తో పాటు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఉంటారు. టాలీవుడ్ టాప్‌ స్టార్స్ అయిన ఈ ఇద్దరు ఇలా కలవడం, ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వెంకటేష్ తో సినిమా ఎలా వస్తుంది అంటూ అనిల్ రావిపూడిని అడిగి తెలుసుకున్న బాలకృష్ణ మరో వైపు తన సినిమాలకు సంబంధించిన విషయాలను సైతం షేర్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా హిట్‌ కొట్టాలని బాలయ్య టీంకు ఆల్ ది బెస్ట్‌ చెప్పాడు.

ఇటీవలే నెల రోజుల పాటు పొల్లాచ్చి లో షూటింగ్ కు వెళ్లి వచ్చిన VenkyAnil03 మూవీ టీం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో షూటింగ్‌ చేస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే పక్కా కమర్షియల్‌ సబ్జెక్ట్‌ తో కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా సినిమాను రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు అనిల్‌ రావిపూడి గతంలోనే ప్రకటించాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్‌ 3 సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలను నిర్మించిన దిల్‌ రాజు ప్రస్తుతం రూపొందుతున్న VenkyAnil03 సినిమాను సైతం భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేశారు.

వెంకటేష్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా, మరో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతుంది. వెంకటేష్ ను ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ భర్తగా చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. వెంకటేష్ ను ప్రేక్షకులు ఎలాంటి వినోదాత్మక పాత్రలో చూడాలి అనుకుంటున్నారో అలాంటి పాత్రలో ఈ సినిమాలో వెంకీని చూపించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కు ఫిదా అవ్వడం ఖాయం అంటున్నారు. అంతే కాకుండా సంక్రాంతికి అసలు సిసలు ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా VenkyAnil03 సినిమా నిలుస్తుందనే నమ్మకంను సైతం వెంకటేష్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.