Begin typing your search above and press return to search.

వామ్మో ... బాలయ్య కోసం మొత్తం ముగ్గురు

ఇక దర్శకుడు బాబి బాలయ్య బాబును గతంలో ఎప్పుడు చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:20 AM GMT
వామ్మో ... బాలయ్య కోసం మొత్తం ముగ్గురు
X

నందమూరి బాలకృష్ణ ఈ ఏడది ఇప్పటికే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి, అలాగే దసరా సమయంలో వచ్చిన భగవంత్ కేసరి రెండు కూడా నిర్మతలకు మంచి లాభాలను తీసుకువచ్చాయి. ఇక ఇప్పుడు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో 109 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తోనే అంచనాలను మరింత పెంచేస్తున్నారు. సీతార ఎంటర్టైర్మెంట్స్ తో పాటు త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఇక దర్శకుడు బాబి బాలయ్య బాబును గతంలో ఎప్పుడు చూడని విధంగా ప్రజెంట్ చేయబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ మూడు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట.

ముడు టైమ్ జోన్స్ లలో సాగే ఈ కథలో కూడా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఊర్వశీ రౌతేల, మీనాక్షి చౌదరి లను హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు. ఇక మరొక ముఖ్యమైన హీరోయిన్ పాత్ర కోసం సీనియర్ నటిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి బాలయ్య బాబు అయితే చాలా కాలం తర్వాత మళ్లీ డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుపోతున్నట్లు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఇందులో మాస్ క్యారెక్టర్ కూడా ఫాన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది అని సమాచారం. ఒకవైపు మాస్ యాంగిల్ చూపిస్తూనే మరొకవైపు స్టైలిష్ రోల్ కూడా ఇందులో హైలెట్ అవుతుంది అని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు బాబి కూడా ఇదివరకే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు బాలయ్య బాబును అంతకుమించి అనేలా చూపించాలని ఈ దర్శకుడు పవర్ఫుల్ స్టోరీని అయితే సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఊటీలో ఒక షెడ్యూల్ పనులు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి టీజర్ కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక మరోవైపు బాలకృష్ణ మరో రెండు ప్రాజెక్టులపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడు.