Begin typing your search above and press return to search.

రామోజీతో బాలయ్య దంపతుల బాండింగ్.. కానీ ఎందుకు రాలేదు?

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:29 AM GMT
రామోజీతో బాలయ్య దంపతుల బాండింగ్.. కానీ ఎందుకు రాలేదు?
X

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడవగా.. ఆదివారం ఉదయం రామోజీరావు పార్థివదేహానికి ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన ఇప్పటికే నిర్మాణం చేయించుకున్న స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. రామోజీ చితికి పెద్దకొడుకు కిరణ్‌ నిప్పంటించారు.

ఆదివారం ఉదయం జరిగిన రామోజీరావు అంతిమ సంస్కారాలకు కూడా పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను, రఘు బాబు, రవి బాబు సహా అనేక మంది సినీ సెలబ్రిటీలు విచ్చేశారు. శనివారం ఉదయం ఈనాడు కార్పొరేట్ బిల్డింగ్ లో సందర్శనార్థం ఉంచిన రామోజీ పార్థివదేహానికి కూడా పలువురు నివాళులు అర్పించారు. చిరంజీవి, పవన్, రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్ సహా పలువురు వచ్చి అంజలి ఘటించారు.

అయితే రామోజీకి కడసారి నివాళులు అర్పించేందుకు బాలకృష్ణ, వసుంధర దంపతులు హాజరు కాలేదు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రముఖుల అంత్యక్రియలకు బాలయ్య హాజరవుతారు. కడసారి నివాళులు అర్పించి వారితో ఉన్న బంధాన్ని పంచుకుంటారు. తన కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే దగ్గరుండి కార్యక్రమాలు జరిపిస్తారు. కానీ రామోజీ అంత్యక్రియలకు ఎందుకు రాలేదన్నది ప్రశ్న.

అదే సమయంలో మరో విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బాలకృష్ణ సతీమణి వసుంధర తండ్రి సూర్యారావు (SRMT లాజిస్టిక్స్), రామోజీరావు మంచి స్నేహితులు అని తెలుస్తోంది. రామోజీకి కుమార్తెలు లేకపోవడంతో వసుంధరను ఆప్యాయంగా చూసుకునేవారని సమాచారం. రామోజీ ఇంట్లోనే వసుంధర ఎక్కువగా ఉండేవారట. అక్కడే ఆమెను సీనియర్ ఎన్టీఆర్ తొలిసారి చూసి బాలకృష్ణతో వివాహం చేయాలనుకున్నారు.

అలా రామోజీరావు.. బాలకృష్ణ, వసుంధరకు పెళ్లి సంబంధం ఖరారు చేశారని టాక్. ఇంత అనుబంధం ఉన్నప్పుడు.. వసుంధర ఎందుకు రామోజీకి నివాళులు అర్పించలేదని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే బాలయ్య.. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారని, జర్నలిజానికి కొత్త సొబగులు దిద్దారని కొనియాడారు.

వరల్డ్ లోనే అతిపెద్ద స్టూడియోగా పేరు గాంచిన రామోజీ ఫిల్మ్‌ సిటీని తెలుగు నేలపై రామోజీ నెలకొల్పారని బాలయ్య ప్రశంసించారు. రామోజీరావు ఇక లేరన్న వార్త ఆవేదన కలిగిస్తోందని తెలిపారు. తన తండ్రి నందమూరి తారక రామారావుతో రామోజీకి ఉన్న రిలేషన్ ప్రత్యేకమైనదని చెప్పారు. కానీ రామోజీరావుకు కడసారి నివాళులు అర్పించేందుకు, అంత్యక్రియలకు బాలకృష్ణ దంపతులు ఎందుకు హాజరు కాలేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలిపోయింది.