Begin typing your search above and press return to search.

బాల‌య్య 50 ఏళ్ల న‌ట ప్ర‌యాణం రికార్డులు తిర‌గ‌రాసేలా!

సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను ఎఫ్‌ఎన్‌సీసీలో జ‌రిగిన క్టరన్ రైజర్ కార్యక్రమంలో రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 7:39 AM GMT
బాల‌య్య 50 ఏళ్ల న‌ట ప్ర‌యాణం రికార్డులు తిర‌గ‌రాసేలా!
X

నందమూరి బాలకృష్ణ తొలిసారిగా నటించిన `తాతమ్మ కల` సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. అంటే రానున్న 2024 ఆగస్టు 30కి బాలకృష్ణ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన పేరిట స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను ఎఫ్‌ఎన్‌సీసీలో జ‌రిగిన క్టరన్ రైజర్ కార్యక్రమంలో రివీల్ చేసారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు.


ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు` అన్నారు.


తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ..`బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే. ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింపుల్ గా ఉంటారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు` అన్నారు.


సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వారో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. 50 ఏళ్లు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్య ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని అంటున్నారు. యూత్ నాడి పట్టుకున్న నటుడు బాలకృష్ణ`అని చెప్పారు.

నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ ` బాలకృష్ణ గారి పేరిట ఎన్నో రికాక‌ర్లుల‌న్నాయి. వాటి దాటేలే ఈ వేడుక నిర్వ‌హిస్తాం. బాలయ్య గారి మీద అందరికీ ప్రేమ ఉంది. అందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నా. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్‌గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరుగుతుంది’ అని తెలిపారు.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘1981లో నేను ఛండశాసనుడు సినిమాకు రాశాను. ఆ టైమ్‌లో ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ. ఒకొక హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలా బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు హిట్ గా నిలిచింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడంటే నేను షాకయ్యా. 50 ఏళ్ల వయసు వచ్చిందేమో అనుకున్నా` అని అన్నారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ `50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం అభినందనీయ‌మైన విషయం. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు 109 సినిమాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఇంకా మంచి సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా` అన్నారు.