బాబాయి - అబ్బాయి ఫైట్ తప్పదా...?
నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు 'దేవర' మరియు బాలకృష్ణ 109 కాస్త అటు ఇటుగా ఒకే సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 10 March 2024 6:33 AM GMTనందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలు 'దేవర' మరియు బాలకృష్ణ 109 కాస్త అటు ఇటుగా ఒకే సమయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాలయ్య - బాబీ కాంబోలో రూపొందుతున్న సినిమాను మొన్నటి వరకు సమ్మర్ చివరి వరకు విడుదల చేయాలని భావించారు.
బాలకృష్ణ రాజకీయ కారణాలు ఇతరత్ర విషయం కారణంగా బాలయ్య 109 సినిమా సమ్మర్ కి విడుదల అవ్వడం సాధ్యం కాదని.. అక్టోబర్ లో సినిమాను దసరా కానుకగా లేదా దీపావళి కానుకగా విడుదల చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇప్పటి వరకు విడుదల విషయంలో బాలయ్య సినిమా మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రకరకాలుగా లీక్ లు మాత్రం వస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే దేవర సినిమాని అక్టోబర్ లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ లో టెన్షన్ కనిపిస్తోంది. బాలయ్య మరియు ఎన్టీఆర్ సినిమాలు అక్టోబర్ లోనే విడుదల అయితే బిగ్ ఫైట్ తప్పేలా లేదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బాబాయి, అబ్బాయి సినిమాలు ఒకే రోజు రాకున్నా కూడా కనీసం రెండు మూడు వారాలు ఉంటేనే ఇద్దరికీ మంచిది అనేది విశ్లేషకుల అభిప్రాయం.
బాలకృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ దేవర సినిమాను అక్టోబర్ లో ఫిక్స్ చేశారు కనుక బాలయ్య సినిమాను సెప్టెంబర్ లేదా నవంబర్ కి షిప్ట్ చేసుకుంటే బాగుంటుందని ఇప్పటి నుంచి నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బాలయ్య సినిమా విడుదల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.