బాలయ్య కీల్ మాంజా..డీల్ మాంజా తయరీ!
మరి బాలయ్య బాల్యంలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారో తెలుసా? అంటే ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆయన చిన్నతనంలో సంక్రాంతి ఎంత గొప్పగా వేడుక చేసుకునేవారు తెలిపారు.
By: Tupaki Desk | 15 Jan 2024 6:56 AM GMTనటసింహ బాలకృష్ణ వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఏ స్టార్ హీరోకి కలిసిరానంతంగా బాలయ్యకి కలిసొచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో కొత్త ఏడాదికిలోకి అడుగు పెట్టేసారు. మరి నటసింహం సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదుగా. ఏటా కుటుంబ సబ్యులతో కలిసి ఎంతో గ్రాండ్ గా వేడుక జరుపుకుంటారు. నారావారి ఫ్యామిలీ-నందమూరి బాలయ్య ఫ్యామిలీ ఒకే చోట చేరి అంతా ఎంతో సంతోషంగా గడుపుతారు.
మరి బాలయ్య బాల్యంలో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారో తెలుసా? అంటే ఆ వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఆయన చిన్నతనంలో సంక్రాంతి ఎంత గొప్పగా వేడుక చేసుకునేవారు తెలిపారు. 'నాకు ఆరేళ్ల వయసు నుంచి హైదరాబాద్ లోనూ పెరిగా. అప్పట్లో జూబ్లిహిల్స్ అంతా అడవిగా ఉండేది. మేమంతా అబిడ్స్ లో ఉండేవాళ్లం. బేగం బజార్..పాత బస్తీ..ట్రూప్ బజార్ అంతా తిరిగేవాడిని.
సంక్రాంతి వచ్చిందంటే సొంతంగా గాలి పటాలు తయారు చేసేవాడిని..చీపురు పుల్లలు ..కాగితం పెట్టి తయారు చేసేవాడిని. కోడిగుడ్డు..అన్నం..గాజుముక్కలు బాగా నూరి దారానికి రాసి కీంజ్ మాంజా.. డీల్ మాంజా తయారు చేసేవాడిని. మా రామకృష్ణా థియేటర్ డాబా పైకి ఎక్కి వాటిని ఎగరవేసేవాడిని. అవన్నీ ఎంతో అందమైన అద్భుతమైన జ్ఞాపకాలు. హీరో అయ్యాక నాన్నలాగే నాదీ ప్రతీ ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వడం మొదలైంది.
అలా విడుదలైతే నాకెంతో ఆనందంగా ఉంటుంది. పండక్కి రిలీజ్ అయిన సినిమాలు సెంటిమెంట్ గా మంచి విజయం సాధించేవి' అని అన్నారు. ఈ ఏడాది మాత్రం బాలయ్య ఏ సినిమా రిలీజ్ చేయలేదు. అన్ని రకాల పండుగలు గత ఏడాది వరుస విజయాలతో ఆస్వాదించారు. ప్రస్తుతం ఆయన హీరోగా కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అవి రిలీజ్ అయ్యే వరకూ అభిమానులు వెయిట్ చేయాల్సిందే. అంతవరకూ పాత సినిమాలతో చిల్ అవ్వాల్సిందే.