ట్రైలర్ టాక్: బొంబాయి అల్ల కల్లోలం
బాంబై మేరీ జాన్'లో తన పాత్ర వృత్తిపరమైన విధులు, వ్యక్తిగత కట్టుబాట్ల మధ్య నలిగిపోయే సీరియస్ పోలీసాఫీర్ కేకే మీనన్ అసలు సమస్య ఏమిటన్నదే ఈ సిరీస్.
By: Tupaki Desk | 4 Sep 2023 2:36 PM GMTముంబై (బాంబై) మురికివాడలు, అక్కడ మాఫియా గురించి ఎన్ని సినిమాలు తీసినా ఇంకా స్కోప్ ఉండనే ఉంటుంది. గ్యాంగ్ స్టర్ల అడ్డాగా ఆర్థిక రాజధాని ముంబైకి బోలెడంత చరిత్ర ఉంది. ఇప్పుడు చరిత్రలో అలాంటి ఒక గ్యాంగ్ స్టర్ కథాంశంతో బొంబాయ్ మేరీ జాన్ తెరకెక్కింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమైంది. బాంబై మేరీ జాన్ అనేది.. షుజాత్ సౌదాగర్ - రెన్సిల్ డిసిల్వా క్రియేట్ చేసిన10-భాగాల సిరీస్. దీనిని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. S హుస్సేన్ జైదీ ఈ సిరీస్ కి కథ అందించారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 14న విడుదల కానుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
'బాంబై మేరీ జాన్'లో తన పాత్ర వృత్తిపరమైన విధులు, వ్యక్తిగత కట్టుబాట్ల మధ్య నలిగిపోయే సీరియస్ పోలీసాఫీర్ కేకే మీనన్ అసలు సమస్య ఏమిటన్నదే ఈ సిరీస్. ఇస్మాయిల్ కద్రి పాత్రలో కేకే మీనన్ నటించారు. షుజాత్- రెన్సిల్ ఈ సిరీస్ కి దర్శకులు. నిజానికి స్వాతంత్య్రానంతర కాలంలో సాగే కథాంశమిది. అందుకు తగ్గట్టే నాటి వాతావరణం యాంబియెన్స్ డ్రెస్సింగ్ ప్రతిదీ తాజా ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. ముంబైలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే గ్యాంగ్ స్టర్లతో పోరాడే వాడిగా మీనన్ నటించగా.. మాఫియా ప్రపంచంలో దారా కద్రి (అవినాష్ తివారీ) అనే యువకుడు ఎలా ఎదిగాడన్నది తెరపై ఆవిష్కరించారు.
ఇస్మాయిల్ పాత్ర ఇందులో ఎంతో కీలకమైనది. అతడు నిజాయితీ గల పోలీసు.. పరిపూర్ణత లేని చురుకైన తండ్రి. ఒక వైపు అతడు బాంబై నగరాన్ని అన్ని నేరాల నుండి క్లీన్ చేయడానికి కట్టుబడి ఉన్న పోలీస్ అధికారి. మరోవైపు తన కుటుంబాన్ని రక్షించడానికి అతడు నగరంలోని క్రైమ్ సిండికేట్‌కు బంటుగా మారవలసి వస్తుంది. ఇస్మాయిల్ తన చుట్టూ ఉన్న చెడుకు లొంగిపోకుండా అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా కానీ.. అతడు నగరంలో కొత్త గ్యాంగ్ లార్డ్‌గా తన రక్తం (వారసుడు) ఎదుగుదలను చూడవలసి వస్తుంది. ఆ క్రమంలోనే అతడు ఎలా నలిగిపోయాడన్నది సిరీస్ లో చూడాలి. గ్యాంగ్ స్టర్ గా నటించిన హీరో రవితేజ తమ్ముడిలా కనిపించడం మరో కొసమెరుపు. అతడి ముఖాకృతి గడ్డం మీసాలు కళ్లు తలకట్టు ప్రతిదీ రవితేజను గుర్తు చేసాయి. ఈ సిరీస్ కి రితేష్ సిధ్వాని, కాసిమ్ జగ్మాగియా, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలు.
దర్శకుడిగా షుజాత్ సృజనాత్మకత ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. పాత రోజుల్లోకి తీసుకెళ్లేలా పాత్రలు వాతావరణాన్ని సృష్టించడంలో అతడు సక్సెసయ్యాడు. పూర్తి సిరీస్ ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాలి. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు భూభాగాల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 14 నుండి 'బాంబై మేరీ జాన్' 10 ఎపిసోడ్‌లు ఓటీటీలో ప్రసారం కానున్నాయి.