చిరు..బాలయ్య అవార్డులపై బండ్ల గణేష్ కామెంట్!
బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా? ఆయన వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ సంచలనమే.
By: Tupaki Desk | 2 Dec 2024 6:03 AM GMTబ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా? ఆయన వ్యాఖ్యలు మాత్రం ఎప్పుడూ సంచలనమే. రాజకీయం అయినా...సినిమా అయినా గణేష్ మాట్లాడితే ఓ వైబ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణకు పద్మవీభూషణ్, చిరంజీవికి భారత వస్తుందని ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి. ఈ ప్రచారం గురించి మీరేమంటారు అంటే? దీనికి గణేష్ ఇలా స్పందించారు. `వారికి అర్హత ఉంది.
పురస్కారం వస్తుందనే నమ్మకం ఉంది. చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్ కు కూడా భారతరత్న ఇచ్చారు. మెగాస్టార్ కు కూడా 200 శాతం వస్తుంది` అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ల తర్వాత తరం నటుల తర్వాత చిరంజీవి పేరు భారతరత్న రేసులో చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
ఇటీవలే పద్మ విభూషణ్ మెగాస్టార్ మణిహారంలో చేరింది. భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్. 2006లో పద్మభూషణ్ చిరంజీవి అందుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డులోనూ మెగాస్టార్ చోటు సంపా దించారు. ఇటీవల ఏఎన్నార్ జాతీయ పౌర పురస్కారం కూడా అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు.. రివార్డులు మెగాస్టార్ సొంతం.
ఈ నేపథ్యంలో భారతరత్న కు సైతం మెగాస్టార్ అన్నిరకాలుగా అర్హుడు అన్న మాట అన్నిచోట్లా వినిపిస్తుంది. అలాగే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పద్మభూషణ్ అవార్డుకు గాను సినీ పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో సీనియర్ నటుడు మురళీమోహన్ పేరుని కూడా సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.