Begin typing your search above and press return to search.

ఛాతి నొప్పితో ఆపోలో ఆసుప‌త్రిలో బండ్ల గ‌ణేష్!

దీంతో ఆయ‌న అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 6:41 AM GMT
ఛాతి నొప్పితో ఆపోలో ఆసుప‌త్రిలో బండ్ల గ‌ణేష్!
X

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఆసుప‌త్రి లో చేరారు. ఛాతి నొప్పితో ఆయ‌న్ని కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్చారు. ప్ర‌స్తుతం అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇందులో బండ్ల గణేష్ బెడ్‌పై పడుకుని ఉండగా.. నర్సు ఆయనకి ఇంజెక్షన్ ఇస్తోంది. దీంతో ఆయ‌న అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెబుతున్నారు. కరోనా స‌మ‌యంలో రెండు మూడు సార్లు హాస్పిటల్ లో చేరిన సంగ‌తి తెలిసిందే.కొంత కాలంగా గ‌ణేష్ సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటారు. ఈ నేప‌థ్యంలో సినిమాల‌కంటే ఎక్కువ‌గా రాజ‌కీయాలపైనే ఫోక‌స్ పెట్టారు. ఏపీ, తెలంగాణ‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజకీయాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

స‌రిగ్గా నేడు ఫ‌లితాల విడుద‌ల‌వుతోన్న సంద‌ర్భంలో ఆసుపత్రిలో చేర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బండ్ల ఫాలోవ‌ర్లు ఆయ‌న రాజ‌కీయ ప్ర‌సంగాల్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయానంతరం ఆయన గ‌ణేష్ యాక్టివ్ గా ఉంటున్నారు. టీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అవుతూ ఎవరైనా కాంగ్రెస్ పార్టీపై కామెంట్ చేస్తే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు.

ఈ మధ్య ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏదో పదవి కూడా ఇవ్వబోతుందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇటు ఏపీలోనూ చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి మ‌ద్ద‌తుగా నిలిచారు. తాజాగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో కోలుకున్న అనంత‌రం గ‌ణేష్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.