Begin typing your search above and press return to search.

బండ్లన్న పై మరోసారి.. ఈసారి అంతకు మించి!

సినీ నిర్మాత ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే కూడా ఎక్కువగా రాజకీయాలు మరియు వివాదాల కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   3 May 2024 11:37 AM GMT
బండ్లన్న పై మరోసారి.. ఈసారి అంతకు మించి!
X

సినీ నిర్మాత ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే కూడా ఎక్కువగా రాజకీయాలు మరియు వివాదాల కారణంగా వార్తల్లో ఉంటున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి గురించి పదే పదే సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బండ్ల గణేష్ ఈసారి కబ్జా కేసు నమోదు అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఫిల్మ్‌ నగర్ లోని రూ.75 కోట్ల ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆ ఇంటి యజమాని అయిన హీరా గ్రూప్‌ సీఈఓ నౌహీరా షేక్ ఆరోపించారు. గత కొన్నాళ్లుగా ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న బండ్ల గణేష్ ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్‌ చేసి ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.

తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు బండ్ల గణేష్ పాల్పడుతున్నాడు అంటూ ఫిర్యాదులో నౌహీరా షేక్ పేర్కొన్నారు. వెంటనే తన ఇంటి నుంచి బండ్ల గణేష్ ను ఖాళీ చేయించడంతో పాటు, తన ఇంటిని తనకు అప్పగించాలి అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

ఈ విషయమై ఇప్పటివరకు బండ్ల గణేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొదట పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పోలీసు ఉన్నతాధికారుల వద్దకు నౌహీరా వెళ్లడంతో ఫిల్మ్‌ నగర్‌ పోలీసులు ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారట. పోలీసులు తెలుసుకున్న వివరాల ప్రకారం హీరా గ్రూప్ కి చెందిన ఆ ఇంటిని బండ్ల గణేష్ కొన్నాళ్ల క్రితం అద్దెకు తీసుకున్నాడు. నెలకు లక్ష రూపాయల చొప్పున అద్దె చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో బండ్ల అద్దె కూడా చెల్లించడం లేదు అని నౌహీరా షేక్‌ ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయమై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.