'యానిమల్' కి బంగ్లాదేశ్ సెన్సార్ షాక్!
అయితే సినిమాలో హింస..కృరత్వం...అభ్యంతరకర సన్నివేశాలు సినిమా కొన్ని విమర్శలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 25 Dec 2023 9:57 AM GMTఇటీవల రిలీజ్ అయిన 'యానిమల్' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. భారీ వసూళ్లతో రణబీర్ కపూర్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాతో రణబీర్ తెలుగులోనూ బాగా ఫేమస్ అయ్యాడు. నేరుగా తెలుగు సినిమా చేస్తే ఎంత గుర్తింపు దక్కుతుందో? అంతకు మించిన ఐడెంటిటీ యానిమల్ ద్వారా రణబీర్ కి దక్కింది. ఈ విజయంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కెరీర్ లోనే హ్యాట్రిక్ నమోదైంది.
అయితే సినిమాలో హింస..కృరత్వం...అభ్యంతరకర సన్నివేశాలు సినిమా కొన్ని విమర్శలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఇండియాలో సినిమా 'ఏ' సర్టిఫికెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజ్ అనంతరం ఓ సెక్షన్ ఆడియన్స్ తీవ్ర స్థాయిలోనూ విమర్శించారు. వాటిపై సందీప్ సైతం అంతే ధీటుగా బధులి చ్చారు. తాజాగా ఈ సినిమాని బంగ్లాదేశ్ లోనూ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడి సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
సెన్సార్ బోర్డు కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సన్నివేశాలు అక్కడి ప్రేక్షకుల కు సరిపడవని సెన్సార్ సభ్యులు తేల్చినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. బంగ్లా దేశ్ సెన్సార్ బోర్డు 27 నిమిషాల సినిమాని కట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సినిమా నిడివి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మొత్తం వ్యవధి 2 గంటల 56 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని రా అండ్ రస్టిక్ సన్నివేశాల్ని క్లోజప్ షాట్ లో చిత్రీకరించిగా వాటిని తొలగించి ముంబై సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే చివర్లో చాకు తో పీక కొసే సన్నివేశానికి బ్లర్ కూడా వేయలేదు. దీనిపైనా ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమైంది. మరీ ఇంత దారుణంగా సినిమాలో ఎలా చూపిస్తారని? దానికి సెన్సార్ ఎలా అను మతిచ్చిందని పలువురు మండిపడ్డారు. తాజాగా బంగ్లా సెన్సార్ బోర్డ్ మాత్రం చాలా సన్నివేశాల్ని కత్తిరించినట్లు తెలుస్తోంది.