బడ్జెట్ 150 కోట్లు ..వసూళ్లు 20 కోట్లు!
స్టోరీ సిద్దం చేయడం నాటి నుంచి సెట్స్ కు వెళ్లడం...అటుపై సెట్స్ లో ఎదురైన సవాళ్లును ఎంతో సమర్దవంతంగా ఎదుర్కుని పూర్తి చేసి రిలీజ్ చేసారు.
By: Tupaki Desk | 18 Jan 2025 5:39 AM GMTకంప్లీట్ స్టార్ మోహన్ లాల్ 'బరోజ్ 3డీ' చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి తానే తొలిసారి కెప్టెన్ కుర్చీ ఎక్కారు. 'గార్డియన్ ఆఫ్ డీగామా ట్రెజ్యూర్' ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్ లాల్ సహా సినిమాలో ప్రతీ పాత్రను ఓ ఇన్నోవేటివ్ ఐడియాతో రూపొందించాడు. అందుకోసం రేయింబవళ్లు శ్రమించారు. స్టోరీ సిద్దం చేయడం నాటి నుంచి సెట్స్ కు వెళ్లడం...అటుపై సెట్స్ లో ఎదురైన సవాళ్లును ఎంతో సమర్దవంతంగా ఎదుర్కుని పూర్తి చేసి రిలీజ్ చేసారు.
అశీర్వాద్ సినిమాస్ ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నిర్మాణం కోసం ఎక్కడా రాజీ పడలేదు. మోహన్ లాల్ అడిగిన ప్రతీది క్షణాల్లో సమకూర్చి ముందుంచారు. ప్రత్యేకమైన భారీ హంగులతో కూడిన సెట్లు... విదేశీ లొకేషన్లు....విదేశీ కంపెనీల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహించడం. ఇలా ది బెస్ట్ క్వాలిటీ పిక్చర్ అందించడం కోసం నిర్మాత ఆంటోనీ పెరంబూర్ ఏమాత్రం రాజీ పడలేదు.
మొత్తంగా సినిమా పూర్తి చేసి తొలికాపీ రావడానికి దాదాపు 150 కోట్లు ఖర్చు అయింది. మరి ఈసినిమా రిలీజ్ తర్వాత లాంగ్ రన్ లో వసూళ్లు ఎంత అంటే ? 20 కోట్లు అని తెలుస్తోంది. అంటే సినిమా ఎంత దారుణమైన వైఫల్యాన్ని ఎదుర్కుందన్నది అద్దం పడుతుంది. ఇంతవరకూ మోహన్ లాల్ కెరీర్ లో భారీ బడ్జెట్తో నిర్మించిన తొలి చిత్రం ఇదే. ఆబడ్జెట్తో పొల్చితే వసూళ్ల శాతం చూస్తే? ఏమాత్రం మింగుడు పడదు.
అంత పెద్ద స్టార్ హీరో సినిమాకి 20 కోట్లు అంటే? ఎంత పెద్ద అపవాడు. మోహన్ లాల్ సినిమాలు మలయాళంలో పాటు సౌత్ లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతుంటాయి. హిందీలోనూ అతడి మార్కెట్ పర్వాలేదు. బడ్జెట్ ని పూర్తిగా రికవరీ చేయలేకపోయినా కనీసం 100 కోట్ల లోపు రిటర్న్ కూడా తీసుకురావడంలో సినిమా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే ఈసినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చారని కొందరు మలయాళ నిర్మాతలు మాట్లాడారు. సినిమాని కావాలనే కొందరు కిల్ చేసారని....సరైన రిపోర్ట్ ఇవ్వకుండా సినిమాకి తొలి షో అనంతరం నెగిటివ్ టాక్ వచ్చేలా కక్ష గట్టి వ్యవహరించారనే వాదన తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా బరోజ్ కి మాత్రం వచ్చిన నష్టం ఇప్పట్లో పూడ్చలేనిది. అదే బ్యానర్లో మోహన్ లాల్ ఐదారు సినిమాలు చేసి హిట్ ఇస్తే గానీ సాధ్యం కాదు.