Begin typing your search above and press return to search.

సూపర్‌స్టార్‌ మూవీ ఏడాది ఎదురు చూపులకు తెర!

ఈ సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు డేట్‌ ఫిక్స్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:17 AM GMT
సూపర్‌స్టార్‌ మూవీ ఏడాది ఎదురు చూపులకు తెర!
X

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కానీ ఆయన దర్శకత్వంలో రూపొందిన పిల్లల మూవీ 'బరోజ్‌' మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. గత ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉంది. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ సైతం పూర్తి అయిన బరోజ్‌ సినిమా విడుదల విషయంలో ఏదో ఒక అడ్డంకి తగులుతూనే ఉంది. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు డేట్‌ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా బరోజ్ రాబోతుందనే ప్రకటన వచ్చింది.

సూపర్‌ స్టార్‌ మూవీ కావడంతో బరోజ్ కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. పిల్లల మూవీ అయినా పెద్ద వారు చూసే ఎలిమెంట్స్ ఉన్నాయని, పిల్లలు, పెద్దలు అంతా బరోజ్‌ సినిమాను ఎంజాయ్ చేస్తారని అంతా భావిస్తున్నారు. మోహన్‌లాల్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన బరోజ్‌ సినిమాకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగి పోవడంతో డిసెంబర్‌లో క్రిస్మెస్ కానుకగా విడుదల చేయడం కన్ఫర్మ్‌ అయింది. కేరళ తో పాటు ఓవర్సీస్లో ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

జిజో పున్నూస్‌ రచించిన బరోజ్‌ : గార్డియన్‌ ఆఫ్ ది గామాస్ ట్రెజర్‌ నవల ఆధారంగా 'బరోజ్‌' సినిమాను మోహన్‌లాల్‌ రూపొందించారు. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లుక్‌తో పాటు పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్‌, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. పిల్లల సినిమా అయినా గ్రాఫిక్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరిగిందట. డిసెంబర్‌ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మలయాళ సినిమాలు సైడ్‌ ఇవ్వనున్నాయి. అంతకు ముందు రిలీజ్ డేట్‌ అనుకున్న సినిమాలు సైతం తప్పుకున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాను ఆశీర్వాద్‌ సినిమాస్ బ్యానర్‌ పై ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మించారు. మోహన్‌లాల్‌ ను బరోజ్ పాత్రలో చూడబోతున్నాం. మాయ, సీజన్‌, తుహిన్ మీనన్‌, గురు సోమ సుందరం వంటి ప్రముఖ మలయాళ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మొదట మలయాళంలో ఈ సినిమాను విడుదల చేసి, వచ్చిన టాక్ ను బట్టి అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. మోహన్‌ లాల్‌ ఒక వైపు భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ మరో వైపు ఇలా పిల్లల సినిమాలు చేయడం అభినందనీయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే మోహన్‌లాల్ నుంచి మరిన్ని వైవిధ్యభరిత సినిమాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.