Begin typing your search above and press return to search.

చిరంజీవిని కాద‌ని మోహన్‌బాబుని ఎంపిక చేసిన ర‌జ‌నీ?

రజనీకాంత్ నటించిన క్లాసిక్ హిట్ చిత్రం 'బాషా' (15 జ‌న‌వ‌రి 1995) ఇప్పటికీ సినీ ప్రేమికులకు ప్ర‌త్యేక‌మైన సినిమా. ఫిలింమేక‌ర్స్ గైడ్ ఇది

By:  Tupaki Desk   |   18 Oct 2023 3:15 AM GMT
చిరంజీవిని కాద‌ని మోహన్‌బాబుని ఎంపిక చేసిన ర‌జ‌నీ?
X

జైల‌ర్ రీరికార్డింగ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. చిరంజీవి వ్యాఖ్యలు రజనీకాంత్‌ జైలర్‌ని ఉద్దేశించి చేసిన జోక్‌లా కనిపిస్తున్నాయని సోషల్‌ మీడియాలో కొందరు అభిప్రాయపడ్డారు. ఈ చర్చ కొనసాగుతుండగా, రజనీ సినిమాను చిరంజీవి తిరస్కరించడంపై ప్ర‌ముఖ‌ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

రజనీకాంత్ నటించిన క్లాసిక్ హిట్ చిత్రం 'బాషా' (15 జ‌న‌వ‌రి 1995) ఇప్పటికీ సినీ ప్రేమికులకు ప్ర‌త్యేక‌మైన సినిమా. ఫిలింమేక‌ర్స్ గైడ్ ఇది. ఈ చిత్రం హీరోయిజం, స్టోరీ టెల్లింగ్ కి ఒక ప్రమాణాన్ని సెట్ చేసింది. ఎంద‌రో ఔత్సాహిక దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. గతాన్ని దాచిపెట్టిన ఒక సాధారణ వ్యక్తి అనే ఆలోచన నేటికీ సినిమాల్లో ఉపయోగిస్తున్న ఇతివృత్తం. ఇది రజనీకాంత్ బాషాతో మొదలైంది.

దర్శకుడు సురేష్ కృష్ణ బాషా సినిమా ప్రభావం గురించి చర్చిస్తూ అప్ప‌ట్లోనే ప‌లు ఆసక్తికరమైన వివరాలను షేర్ చేసారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌కి ఎవరు సరిపోతారని అడిగినప్పుడు, ఆ పాత్రకు న్యాయం చేయడానికి సూపర్‌స్టార్ అవసరం అని చెప్పారు. ఆసక్తికరంగా 1995లో బాషా భారీ విజయం తర్వాత, సురేశ్ కృష్ణ మాట్లాడుతూ.. తాను చిరంజీవితో తెలుగు రీమేక్‌ని ప్లాన్ చేసానని, అయితే ఆయ‌న‌కు ఇతర కమిట్‌మెంట్‌లు ఉన్నందున అది వర్కవుట్ కాలేదని తెలిపారు.

మోహన్ బాబు దీన్ని చేయగలరా అని రజనీకాంత్ అప్పుడు సురేష్ కృష్ణ‌ను అడిగారు. అయితే దీనికి చిరంజీవి లాంటి హీరో లేదా ఇంకా గొప్ప స్థాయి ఉన్న స్టార్ అవసరమని దర్శకుడు భావించాడు. చిరంజీవితో ప్లాన్స్ వ‌ర్క‌వుట్ కానందున, వారు బాషా డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేశారు. ఇది తెలుగులో కూడా భారీ విజయాన్ని సాధించింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరు తెలుగు నాటా మార్మోగింది. నేటి జ‌న‌రేష‌న్ లో బాషా పాత్రలో ఏ తమిళ నటుడు నటించగలరని అడిగినప్పుడు.. ప్రస్తుత స్టార్లలో అజిత్ కుమార్ అయితే సరిపోతారని దర్శకుడు సురేష్ కృష్ణ‌ సూచించారు. బాషా లాంటి క్లాసిక్ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచ‌న సురేష్ కృష్ణ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఆయ‌న వార‌సుడిగా ఎవ‌రైనా ముందుకు వ‌చ్చి ఈ సినిమా సీక్వెల్ ని ప్ర‌య‌త్నించ‌లేదు.