Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబో సెట్టు.. ఐ ఫీస్ట్ పక్కా..!

బాసిల్ జోసెఫ్ ఓ పక్క తన డైరెక్షన్ లో సినిమాలు చేస్తూ మరోపక్క తన నటనతో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాసిల్ జోసెఫ్ ఒక క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   15 Jan 2025 6:36 AM GMT
క్రేజీ కాంబో సెట్టు.. ఐ ఫీస్ట్ పక్కా..!
X

మలయాళ యంగ్ ఫిల్మ్ మేకర్ బాసిల్ జోసెఫ్ తన వరుస సినిమాలతో ప్రేక్షలను అలరిస్తూ వస్తున్నాడు. అతని నుంచి వస్తున్న సినిమాలు విపరీతమైన స్పందన తెచ్చుకుంటున్నాయి. మలయాళంలో ఆయన చేస్తున్న సినిమాలు కేవలం మలయాళ ఆడియన్స్ ని మాత్రమే కాదు ఓటీటీ వల్ల సౌత్ సినీ ప్రియులను అలరిస్తున్నాయి. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ గా బాసిల్ జోసెఫ్ పేరు మారుమోగుతుంది. టోవినో థామస్ తో మిన్నల్ మురళి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

బాసిల్ జోసెఫ్ ఓ పక్క తన డైరెక్షన్ లో సినిమాలు చేస్తూ మరోపక్క తన నటనతో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాసిల్ జోసెఫ్ ఒక క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈమధ్య సౌత్ స్టార్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ హీరోల ఫోకస్ పెరిగింది. టాలెంటెడ్ డైరెక్టర్ అనిపిస్తే చాలు అతనితో సినిమాలు చేయాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా బాసిల్ సినిమా లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుంది. బాసిల్ లాంటి డైరెక్టర్ తో రణ్ వీర్ సింగ్ సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి.

బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా మాక్సిమం ఆడియన్స్ ని అలరించాయి. రాబోతున్న ఈ కాంబో కూడా క్రేజీగా మారబోతుంది. తప్పకుండా రణ్ వీర్ సింగ్ కి ఇది ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పొచ్చు. అసలైతే రణ్ వీర్ సింగ్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కూడా ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనుకున్న టైం లో ఎందుకో ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ బాసిల్ జోసెఫ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ తో తెరకెక్కించేలా ఉన్నారు. బాసిల్ జోసెఫ్, రణ్ వీర్ ఎలాంటి కథతో వస్తున్నారు. ఈ కాంబో మీద ఉన్న అంచనాలను సినిమా అందుకుందా లేదా అన్నది చూడాలి.