ఆ సినిమాపై జపాన్ అభిమానుల పిచ్చి ప్రేమ!
అయితే ఈ సినిమాపై జపాన్ దేశస్తులు మాత్రం తమ దేశంలో కూడా అనువాద రూపంలో రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు
By: Tupaki Desk | 21 July 2023 10:44 AM GMTఆ భారతీయ చిత్రాన్ని మా దేశమైనా జపాన్ లో రిలీజ్ చేయాలని జపాన్ వాసులు పట్టుబడుతున్నారా? కథ మీదైనా.. అందులో మేము ఉన్నాము? ఆ చరిత్ర మేము చూడాలని ఉత్సాహం చూపిస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే వరుణ్ ధావన్-జాన్వీక పూర్ జంటగా నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'బవాల్' ఓటీటీలో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇది రెండవ ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కించారు.
ఓటీటీలో రిలీజ్ అవుతోన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. నేరుగా థియేటర్లో రిలీజ్ చేసే వెసులు బాటు ఉన్నా నిర్మాతలు ఎందుకనో ఆ ఛాన్స్ తీసుకోలేదు. అయితే ఈ సినిమాపై జపాన్ దేశస్తులు మాత్రం తమ దేశంలో కూడా అనువాద రూపంలో రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు.
రెండవ ప్రపంప యుద్ధం తమతో ముడిపడి ఉన్న నేపథ్యంలో తప్పకుండా రిలీజ్ చేయాలని జపాన్ వాసులు కోరుతు న్నారు. తమ దేశ చరిత్రని..అప్పటి దుర్బర పరిస్థితులు చూడాలనుకుంటున్నట్లు జపాన్ వాసులు సోషల్ మీడియా వేదకిగా పోస్ట్ లు చేస్తున్నారు.
జపనీస్ భాషలో అనువదిస్తే మాకు మా చరిత్ర తెలుస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ల కోరిక మేరకు నిర్మాతలు జపాన్ లో రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఇండియాలో థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుండని చాలా మంది అభిప్రాయ పడ్డారు. కానీ దర్శక-నిర్మాతలు ఓటీటీ రిలీజ్ కి వెళ్లిపోయారు. దీనికి కారణాలు ఏంటన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
భారతీయ చిత్రాలైన 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్'..'కేజీఎఫ్' లాంటి సినిమాలు జపాన్ లో సునామీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. వాటి తర్వాత భారతీయ చిత్రాలకు జపాన్ లో క్రేజ్ రెట్టింపు అయింది. అంతకు ముందు వరకూ ఎక్కువగా సూపర్ స్టార రజనీకాంత్ సినిమాల ప్రభావం అక్కడ ఎక్కువగా ఉండేది.
బాలీవుడ్ సినిమాలు చాలా తక్కువగా ప్రభావం చూపేవి. కానీ రాజమౌళి కారణంగా తెలుగు సినిమాలకు అక్కడ డిమాండ్ పెరిగింది. తెలుగు పాన్ ఇండియా కంటెంట్ జపాన్ కి సైతం వాయు వేగంతో దూసుకుపోతుంది.