Begin typing your search above and press return to search.

స్లీవ్ లెస్ ఫ్రాకులో బ్యూటిఫుల్ స‌యీ

తాజాగా స‌యీ బ్లాక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ ఫ్రాకులో క‌నిపించింది. విభిన్న‌మైన హావ‌భావాలు ప్ర‌ద‌ర్శిస్తూ స‌యీ ఫోటోషూట్ లో పాల్గొంది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 5:14 PM GMT
స్లీవ్ లెస్ ఫ్రాకులో బ్యూటిఫుల్ స‌యీ
X

అడివి శేష్ స‌ర‌స‌న `మేజ‌ర్` అనే పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన స‌యీ.. హిందీ ప‌రిశ్ర‌మ‌లో ద‌బాంగ్ 3తో తెరంగేట్రం చేసింది. న‌టుడు, ద‌ర్శ‌కుడు మహేశ్ మంజ్రేకర్ వార‌సురాలిగా కెరీర్ ప్రారంభ‌మైనా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త ఉంద‌ని చాటుకోవ‌డం కోసం స‌యీ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు త‌మిళం స‌హా హిందీలో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

ఇంత‌లోనే స‌యీ వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్‌లో అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా స‌యీ బ్లాక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ ఫ్రాకులో క‌నిపించింది. విభిన్న‌మైన హావ‌భావాలు ప్ర‌ద‌ర్శిస్తూ స‌యీ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోగ్రాఫ్స్ లో స‌యీ ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఇవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

వృత్తిగ‌తంగా చూస్తే.. అగ్ర‌హీరో అజ‌య్ దేవ‌గ‌న్ తో క‌లిసి ఔరాన్ మే కహన్ దమ్ థా (అనువాదం. వేర్ డిడ్ అదర్స్ హావ్ ద కరేజ్) లో న‌టించింది. నీరజ్ పాండే దర్శకత్వం వ‌హించిన‌ రొమాంటిక్ థ్రిల్లర్ లో దేవగన్, టబుల‌కు జంట‌గా ప‌దో సినిమా. జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి- సాయి మంజ్రేకర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. M. M. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవ‌లే ఈ సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.