మల్లెపువ్వులా మెరిసిపోతున్న బ్యూటీ!
పువ్వుల డిజైన్ తో నిండిన క్రీమ్ కలర్ షోల్డర్ లెస్ గౌనులో అమ్మడు బట్టుబొమ్మని తలపిస్తుంది. ఖుషీ ని ఈ పర్పెక్ట్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా మలిచింది.
By: Tupaki Desk | 1 Nov 2023 8:30 AM GMTఖుషీ కపూర్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు కొత్త ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటాయి. ప్రెండ్స్ గ్యాంగ్ తో పార్టీలకు వెళ్లినా! పబ్ లు...వెకేషన్ ఎలాంటి స్పాట్ కెళ్లినా ఆ ఫోటోలు నెట్టింట కాక పుట్టించాల్సిందే. రేర్ గా అందాల ఆరబోత హైలైట్ అవుతుంది. చిట్టి పొట్టి దుస్తుల్లో ఖుషీ సెగలు పుట్టించిన సందర్భాలెన్నో. ఆల్ట్రామోడ్రన్ బ్యూటీగానూ అగ్గిరాజేస్తుంది.
తాను ఏం చేసినా సంథిగ్ స్పెషల్ గా ఫోకస్ అవ్వాలని చూస్తుంది. తాజాగా ఖుషీ కపూర్ న్యూ డిజైన్ లో సుంగందాలు విదజల్లే మల్లెపువ్వులా గుభాంళించేస్తుంది. పువ్వుల డిజైన్ తో నిండిన క్రీమ్ కలర్ షోల్డర్ లెస్ గౌనులో అమ్మడు బట్టుబొమ్మని తలపిస్తుంది. ఖుషీ ని ఈ పర్పెక్ట్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా మలిచింది. ముఖానికి లైట్ మ్యాకప్..పెదాలకి ఎర్రటి లిప్ స్టిక్ ..హెయిర్ స్టైల్ ప్రతీది ఖుషీని అందంగా ప్రోజెక్ట్ చేస్తున్నాయి.
ఎలివేషన్ సంగతి పక్కనబెడితే ముస్తాబైన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కపూర్ వారసురాల్ని అలా చూసిన అభిమానులంతా ఫిదా అవుతున్నారు. అందమే అసూయపడేంత అందంగా ముస్తాబైందంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక కామెంట్ బాక్స్ లోలెక్కలెనన్ని ప్రపోజల్స్ కి కొదవలేదు. ఖుషీ తెరంగేట్రానికి ముందే ఇలా సంచలనమ వుతుంది.
లాంచ్ అయిన తర్వాత అమ్మడి వేగాన్ని తట్టుకోగలమా? అన్నది సందేహమే. 'ది అర్చీస్' తో ఖుషీ లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్క జాన్వీ కపూర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ అవకాశాలు ఒడిసిపట్టుకుంటుంది.ఇప్పటికే `దేవర` లో పల్లెటూరి పిల్ల లుక్ లో జాన్వీ కుర్రాళ్ల మనసు దొచేస్తోన్న సంగతి తెలిసిందే.