Begin typing your search above and press return to search.

మ‌తాంత‌ర వివాహం, భ‌ర్త‌ వ‌య‌సు తేడాపై బెబో

ఇక ఇదే విష‌య‌మై తాజా ఇంట‌ర్వ్యూలో క‌రీనా వివ‌ర‌ణ ఇచ్చింది. భ‌ర్త‌తో 10 ఏళ్ల వయస్సు అంతరం, సైఫ్‌తో మతాంతర వివాహం గురించి ప్ర‌శ్న‌లు ఎదుర్కోవ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:13 AM GMT
మ‌తాంత‌ర వివాహం, భ‌ర్త‌ వ‌య‌సు తేడాపై బెబో
X

ఇటీవల తన 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న కరీనా కపూర్ ఖాన్ సైఫ్ తో మతాంతర వివాహం గురించి వ‌య‌సు వ్య‌త్సాసం గురించి ప్ర‌స్థావించింది. అవి త‌మ‌ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తాయ‌నే దాని గురించి మాట్లాడింది. కరీనా కపూర్ ఖాన్ - సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్‌ ఆద‌ర్శ‌ జంట‌గా అంద‌రికీ స్ఫూర్తి. ఈ జంట‌కు పెళ్ల‌యి 10 సంవత్సరాలకు పైగా అయింది. ఇద్దరు పిల్లలను స్వాగ‌తించారు. వీరిద్దరూ పిక్చర్ పర్ఫెక్ట్ క‌పుల్ గా హృద‌యాల్లో నిలిచారు. అయితే బెబో క‌రీనా త‌న‌కంటే ప‌దేళ్ల పెద్ద వ‌య‌సు ఉన్న సైఫ్ ని పెళ్లాడుతుంటే దానిపై బోలెడ‌న్ని కామెంట్లు వ‌చ్చాయి.

ఇక ఇదే విష‌య‌మై తాజా ఇంట‌ర్వ్యూలో క‌రీనా వివ‌ర‌ణ ఇచ్చింది. భ‌ర్త‌తో 10 ఏళ్ల వయస్సు అంతరం, సైఫ్‌తో మతాంతర వివాహం గురించి ప్ర‌శ్న‌లు ఎదుర్కోవ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, సైఫ్‌తో తన మ‌తాంత‌ర బంధం నమ్మకాలు విశ్వాసాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఓపెనైంది.

కరీనా -సైఫ్ 2012లో వివాహం చేసుకునే ముందు చాలా సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. ఇద్దరూ సంప్రదాయ ఆచారాలకు స్వస్తి పలికి కోర్టు వివాహాన్ని ఎంచుకున్నారు. కుట మ‌తాలు వ‌య‌సు అంత‌రాలు చూడ‌టం కంటే రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యమైన విషయం సరదాగా ఉండటమేన‌ని క‌రీనా అన్నారు. మేం సర్వమత సంబంధాల గురించి చర్చించడానికి చాలా సమయం గడుపుతాము. అత‌డు చాలా ఎన‌ర్జిటిక్ మ్యాన్. సైఫ్‌ 10 సంవత్సరాలు పెద్ద‌వాడు. చెప్పుకోద‌గ్గ‌ విషయం ఏమిటంటే ఆనందించడం ముఖ్యం. మేం ఒకరినొకరు ఇష్టపడతాము. మా కంపెనీని ఆస్వాధిస్తాం. అత‌డు ఏ విశ్వాసాన్ని అనుసరిస్తాడు? అతని వయస్సు ఎంత? అనేది ముఖ్యం కాదు. అలాంటివి చర్చనీయాంశం కాదు! అని బెబో ఇంటర్వ్యూలో అన్నారు.

తనకు సైఫ్‌కు మధ్య 10 సంవత్సరాల వయస్సు అంతరం గురించి క‌రీనా ఓపెనైంది. తాను 10 సంవత్సరాలు చిన్నదానిని కావడం సంతోషంగా ఉందని చెప్పింది. వయస్సు ముఖ్యమైనది అనుకుంటే, అతను గతంలో కంటే హాట్ గా ఉన్నాడు. సైఫ్‌ ఆందోళన చెందాల్సిన ప‌ని లేదు. అత‌డిని చూసి 53 ఏళ్లు అని ఎవరూ చెప్పలేరు అని క‌రీనా అన్నారు. వయస్సు పట్టింపు లేదు.. గౌరవం ప్రేమ ముఖ్యం. మేము ఒకరితో ఒకరు సరదాగా గడపడం ముఖ్యం అని కరీనా చెప్పారు.

కరీనా కపూర్ ఖాన్ OTT అరంగేట్రం

కరీనా త్వరలో 'జానే జాన్' చిత్రంతో OTTలో అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ త‌దిత‌రులు నటించారు. 21 సెప్టెంబర్ 2023న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల కానుంది.