Begin typing your search above and press return to search.

మహేష్ తో బీడీ మయం!

దీంతో గుంటూరు కారంలో బీడీ కాల్చడం ద్వారా మహేష్ బాబు క్యారెక్టర్ ని త్రివిక్రమ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:53 AM GMT
మహేష్ తో బీడీ మయం!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ సిద్ధం అవుతోంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఏళ్ల తర్వాత మరల మాస్ లుక్ లో దర్శనం ఇస్తున్నాడు.

తాజాగా దసరా సందర్భంగా గుంటూరు కారం చిత్రం నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు కారులో బ్యాక్ సైడ్ కూర్చొని బీడీ కాలుస్తున్న స్టైల్ ని వదిలారు. ఈ స్టిల్ అభిమానులకి భాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా నుంచి సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా వచ్చిన గ్లింప్స్ లో కూడా మహేష్ బాబు బీడీ కాలుస్తూనే కనిపించాడు.

దీంతో గుంటూరు కారంలో బీడీ కాల్చడం ద్వారా మహేష్ బాబు క్యారెక్టర్ ని త్రివిక్రమ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు అనే ప్రచారం తెరపైకి వచ్చింది. మహేష్ బాబు పోకిరి మూవీలో చివరిగా కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించాడు. అలాగే సిగరెట్ కూడా కాల్చాడు. తరువాత ఏ సినిమాలో కూడా సిగరెట్ టచ్ చేయలేదు.

అయితే ఇన్నేళ్ళ తర్వాత గుంటూరు కారం సినిమా కోసం త్రివిక్రమ్ మహేష్ బాబుతో బీడీ కాల్పిస్తున్నాడు. గుంటూరు నేపథ్యంలో నడిచే కథ కావడంతో కాస్తా మాస్ అప్పీల్ కోసం ఇలా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో ఎంత మాస్ ఎలివేషన్స్ ఉన్న త్రివిక్రమ్ స్టైల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా మూవీలో ఉంటాయని తెలుస్తోంది.

అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా గుంటూరు కారం కథ, కథనం త్రివిక్రమ్ చెప్పబోతున్నాడంట. కచ్చితంగా ఈ చిత్రంలో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం అని అభిమానులు అంచనా వేస్తున్నారు.