ముగ్గురు హీరోల 'భైరవం'!
'నాంది' వంటి విభిన్నమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విజయ్ కనకమేడల ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 4 Nov 2024 10:00 AM GMT'నాంది' వంటి విభిన్నమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించి దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న విజయ్ కనకమేడల ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలు గా కనిపించబోతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయిందట. కెకె రాధా మోహన్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు గత కొన్ని రోజులుగా ఏం టైటిల్ ని ఫిక్స్ చేయాలా అంటూ మేకర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు దర్శకుడు విజయ్ కనకమేడల ఒక టైటిల్ ను కన్ఫర్మ్ చేయడం జరిగింది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'భైరవం' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. అధికారికంగా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం విడుదల చేయడం ద్వారా సినిమాపై అంచనాలు మరింతగా పెంచే విధంగా దర్శకుడు విజయ్ ప్లాన్ చేస్తున్నారు.
'భైరవం' సినిమా కథను తమిళ సూపర్ హిట్ మూవీ 'గరుడన్' కథ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది అధికారిక రీమేక్ అయినప్పటికీ చాలా మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. గరుడన్ లో ఉన్ని ముకుందన్, ఎం. శశికుమార్, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి స్థానికంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే నిర్మాత రాధా మోహన్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసి రీమేక్ కు సిద్ధం అయ్యారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాకు భైరవం అంటూ టైటిల్ ను ఖరారు చేస్తే కచ్చితంగా మంచి హైప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రీమేక్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒకింత నిరుత్సాహం ఉంటుంది. కానీ భైరవం సినిమా విషయంలో అలా ఉండదని దర్శకుడు విజయ్ సన్నిహితులు, చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మంచి సినిమాలను అందించిన విజయ్ నుంచి రీమేక్ కూడా అంతే బాగుంటుందని, తమిళ ఫ్లేవర్ పూర్తిగా తొలగించి, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేర్పులు చేసి, కొన్ని పాత్రలను అదనంగా జొప్పించి కథను చెప్పడం జరుగుతుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు సినిమా రిలీజ్ పై దర్శకుడు, నిర్మాత క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కి మంచి బజ్ క్రియేట్ చేస్తే పాజిటివ్ టాక్ దక్కించుకుంటే భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.