Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్ .. రేసులో క్రేజీ రీమేక్!

పండగ టైమ్ కు రావడం ఒక చాలెంజ్ అయితే అందులో థియేటర్స్ రాబట్టుకోవడం మరొక బిగ్ చాలెంజ్.

By:  Tupaki Desk   |   12 Oct 2024 8:30 PM GMT
సంక్రాంతి ఫైట్ .. రేసులో క్రేజీ రీమేక్!
X

సంక్రాంతి 2025 టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద క్రేజీ ప్రాజెక్టులు పోటీ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పండగ సీజన్ లో స్టార్ హీరోలతో పాటు పలువురు యువ హీరోలు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్ 'గేమ్ చేంజర్', నందమూరి బాలకృష్ణ 'సర్కార్ సీతారాం', వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం', సందీప్ కిషన్ 'మజాకా' చిత్రాలు విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.

పండగ టైమ్ కు రావడం ఒక చాలెంజ్ అయితే అందులో థియేటర్స్ రాబట్టుకోవడం మరొక బిగ్ చాలెంజ్. అంతే కాకుండా సరైన డేట్ అందుకోవడం కూడా ఇక్కడ చాలా అవసరం. ముందుగా జనవరి 10న రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదల కానుంది. మరో రెండు రోజుల అనంతరం జనవరి 12న బాలకృష్ణ నటిస్తున్న సర్కార్ సీతారాం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక 14న వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నాం మంచి థియేటర్స్ తోనే రిలీజ్ రానుంది. సందీప్ కిషన్ హీరోగా 'మజాకా' జనవరి 11న రావాలని అనికుంటోంది. ఈ డేట్ విషయంలో చివరి నిమిషంలో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉండవచ్చు.

ఇదిలా ఉంటే, మరో సర్‌ప్రైజ్ ఎంట్రీ గా బెల్లంకొండ శ్రీనివాస్ తన కొత్త సినిమాతో ఈ రేసులోకి చేరారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'గరుడన్' అనే తమిళ బ్లాక్ బస్టర్ రీమేక్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాకు సంబంధించి షూటింగ్ ఫార్మాలిటీస్ జెట్ స్పీడ్ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ రీమేక్ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళై నటిస్తున్నారు. ఇక సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందిస్తుండగా, నిర్మాతగా కే.కే రాధా మోహన్ వ్యవహరిస్తున్నారు. షూటింగ్ నవంబర్ నాటికి పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తి చిత్రీకరణ పూర్తైన తరువాత అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు.

ఈ సంక్రాంతికి భారీగా సినిమాలు విడుదల కావడంతో పోటీ చాలా ఎక్కువగా ఉంది. స్టార్ హీరోల సినిమాల మధ్య విడుదల కావడం వల్ల గరుడన్ రీమేక్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. తమిళంలో విజయవంతంగా నిలిచిన ఈ సినిమా రీమేక్ కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. సంక్రాంతి సమయానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎన్ని సినిమాలు ఉన్నా ఆదరిస్తారు. కానీ కంటెంట్ తో మెప్పిస్తేనే సరైన రెస్పాన్స్ ఉంటుంది. ఇక ఈసారి రేసులో ఉన్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ మరింత తీవ్రమైంది. మరి ఏ సినిమా అత్యదిక ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.