Begin typing your search above and press return to search.

బెల్లంకొండ బర్త్‌డే స్పెషల్‌.. నాలుగు సినిమాలతో సర్‌ప్రైజ్‌

అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు భారీగా పరిచయం అయిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

By:  Tupaki Desk   |   3 Jan 2025 11:24 AM GMT
బెల్లంకొండ బర్త్‌డే స్పెషల్‌.. నాలుగు సినిమాలతో సర్‌ప్రైజ్‌
X

అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు భారీగా పరిచయం అయిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు అయిన సాయి శ్రీనివాస్‌ కి ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. చివరకు ఈయన హిందీలోనూ ప్రయత్నించాడు. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి విడుదల చేశారు. అతి పెద్ద డిజాస్టర్‌గా హిందీ చత్రపతి సినిమా నిలిచింది. దాంతో అటు వైపు మళ్లీ వెళ్ల కూడదని బెల్లంకొండ హీరో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఆయన హీరోగా నటించిన సినిమాలు రాలేదు, అప్పట్లో వచ్చిన సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోలేదు. అయినా ప్రస్తుతం ఈ బెల్లంకొండ హీరో ఖాతాలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాల్లో కనీసం మూడు సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తాయని సమాచారం అందుతోంది. మొదటగా భైరవం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో మంచు మనోజ్‌ కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. హిట్‌ చిత్రాల దర్శకుడు విజయ్ కనక మేడల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కనుక అంచనాలు భారీగా ఉన్నాయి.

భైరవం సినిమాను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. నేడు సాయి శ్రీనివాస్ బర్త్‌ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను విడుదల చేశారు. సినిమా పోస్టర్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా భైరవంలో మాస్‌ లుక్‌తో పాటు టైసన్ నాయుడు సినిమాలోని స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. టైసన్ నాయుడు సినిమాకు సాగర్‌ కే చెంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్లా నాయక్‌ సినిమా తర్వాత సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ రెండు సినిమాలు కాకుండా కౌశిక్ పెగాళ్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 11వ సినిమాను చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయిన ఈ సినిమాను సాహు గారపాటి నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ ను రివీల్‌ చేసిన మేకర్స్ త్వరలోనే టైటిల్‌ను ప్రకటించి ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక మూన్ షైన్ బ్యానర్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 12వ సినిమా రూపొందబోతుంది. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. దర్శకుడు ఇతర విషయాల గురించి అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి బెల్లంకొండ బాబు ఏకంగా నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టాడు.