Begin typing your search above and press return to search.

'ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. సినిమా దుమ్ము లేచిపోతుంది'

ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో, చిత్ర బృందం సమక్షంలో మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 3:02 PM GMT
ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. సినిమా దుమ్ము లేచిపోతుంది
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ''భైరవం''. విజయ్ కనకమేడల దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌పై జయంతిలాల్ గడా సమర్పణలో కెకె రాధామోహన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన క్యారక్టర్ పోస్టర్లు, ఫస్ట్ సింగిల్‌ సినిమాపై జనాల్లో ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో, చిత్ర బృందం సమక్షంలో మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు.

'భైరవం' టీజర్ లాంచ్ ఈవెంట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''మీ అందరినీ చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈసారి మంచి కథా బలం ఉన్న సినిమాతో రావాలని గట్టిగా నిర్ణయించుకునే వస్తున్నాం. 'జయ జానకి నాయక' తర్వాత, అంతకు మించి ఒక బలమైన సినిమా చేయాలని నిర్మాత శ్రీధర్ తో చెప్పాను. అప్పటి నుంచే మంచి కథ కోసం వేట మొదలైంది. అలా 'భైరవం' లాంటి మంచి కథ దొరికింది. డైరెక్టర్ విజయ్ ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారు. కథను ఆయన వోన్ చేసుకున్న విధానం సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఆయన టాప్ డైరెక్టర్ అవుతారు. నారా రోహిత్ ఈ సినిమా ఒప్పుకోవడం మోస్ట్ హ్యాపీ మూమెంట్. రోహిత్, మనోజ్ తప్పితే ఆ పాత్రలను ఎవరు చేయలేరనే అంతా గొప్పగా చేశారు. వాళ్లతో వర్క్ చేసే అవకాశం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాను. అదితి, ఆనంది, దివ్య అద్భుతంగా నటించారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఎంతో హార్డ్ వర్క్ తో సినిమా చేసాం. ఇది టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొచ్చి, మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఇది ఒక మెమరబుల్ మూవీ అవుతుంది'' అని అన్నారు.

మనోజ్ మంచు మాట్లాడుతూ.. ''నేను భైరవుడిని నమ్ముతా. ఆయన ఇతివృత్తంగా నేను తీయాల్సిన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా టేకాఫ్ ఆలస్యమైంది. నటుడిగా కొంత గ్యాప్‌ తీసుకున్న తర్వాత ఓకే చేసిన ‘మిరాయ్‌’ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ షూటింగ్‌ జరుగుతున్నప్పుడే ‘భైరవం’ అవకాశం వచ్చింది. 4 నెలల్లో పూర్తి చేస్తామని డైరెక్టర్ చెబితే, ఎలా సాధ్యమవుతుందని అడిగా. విజయ్ ఈ స్క్రిప్టు చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. ఇందులో నా బ్రదర్ రోహిత్, సాయి ఉన్నారని చెప్తే ఇంకా ఎక్సైట్ అయ్యాను. వెంటనే ఒప్పుకున్నాను. విజయ్ చాలా డెడికేటెడ్ గా ఈ సినిమా తీశారు. ఆయన హార్డ్ వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నిర్మాతలకి థాంక్యూ సో మచ్. తమ్ముడు సాయి సొంత బ్రదర్ లానే. ఆల్రెడీ ఈ సినిమా చూశాను. సాయి పెర్ఫార్మెన్స్ చించి పారేశాడు. ఈ సినిమా గొప్ప విజయం కావాలని, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రోహిత్ బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్. ఈ సినిమాతో ఇంకా క్లోజ్ అయిపోయాం. 2016లో 'ఒక్కడు మిగిలాడు' సినిమా చేసినప్పుడు రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది నా లాస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత ఎందుకో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ 'భైరవం'లో రోహిత్ తో కలిసి సినిమా చేయడం హ్యాపీగా ఉంది. తను అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అదితి సింగర్, మంచి డాన్సర్. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ అదిరిపోతుంది. సినిమా దుమ్ము లేచిపోతుంది'' అని అన్నారు. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకుని మార్కెట్లో అమ్ముడుపోవడానికి తాను కాయ, పండు కాదని.. మనోజ్ ని అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. ''భైరవం నా కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక క్యారెక్టర్. ఇలాంటి పాత్రని తీసుకొచ్చిన విజయ్ కి థాంక్యూ. సినిమాని 4 నెలల్లో కంప్లీట్ చేయడానికి డైరెక్టర్ విజయ్, ప్రొడ్యూసర్ రాధా మోహన్ సపోర్టే కారణం. మనోజ్ తో నాకు చిన్నప్పటినుంచి పరిచయం. ఈ సినిమా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. తను నాకు ఒక బ్రదర్. అవసరం ఉన్నప్పుడు ఉంటాడు. ఈ మూవీతో మా ఇద్దరి బాండింగ్ మరింత పెరిగింది. మరో బ్రదర్ సాయితో వర్క్ చేయడం వండర్ఫుల్ జర్నీ. సెట్స్ లో చాలా ఎంజాయ్ చేసాం. ఇది నాకు మోస్ట్ మెమొరబుల్ ఫిలిం. విజయ్ ఈ సినిమాతో విజయం సాధించి మరెన్నో పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది'' అని అన్నారు.

విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ''మనోజ్ అన్న, సాయి, రోహిత్ నన్నొక సొంత బ్రదర్ లాగా చూసి చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. శ్రీ చరణ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. 'వెన్నెల' పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి చాలా అద్భుతమైన సెట్ వర్క్ చేశారు. నిర్మాత రాధ మోహన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. హరి ఫోటోగ్రఫీ ఈ సినిమాకి చాలా ప్లస్. ఇప్పటివరకు రోహిత్ ని ఒకలాగా చూసుంటారు. ఈ సినిమాలో మరోలా చూస్తారు. ఆయనలోని మాస్ యాక్షన్ బయటికి వచ్చింది. మాస్ యాక్షన్ ఆడియన్స్ కి ఈ సినిమా పండగలా ఉంటుంది. మనోజ్ అన్నతో పని చేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఆయన్ని చూసి ఆడియన్స్ షాక్ అవుతారు. ఇప్పటివరకు సాయి చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. దీంతో సాయి ఒక రేంజ్ లో ఉంటారు. నన్ను కూడా ఒక మెట్టు పైకి తీసుకువెళ్తారు. ముగ్గురు హీరోలతో కలిసి పని చేయడం నాకు చాలా అద్భుతమైన అనుభూతి. 'నాంది' చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో, 'భైరవం' చూసినప్పుడు కూడా అంతే థ్రిల్ ఎమోషన్ ఫీల్ అవుతారు. 'నాంది'కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాతో నాకు అంతకంటే మంచి పేరు వస్తుంది'' అని అన్నారు.

నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ.. తమ బ్యానర్ మొదలుపెట్టి 15 ఏళ్ళు అవుతుందని, ఎంతగానో సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ముగ్గురు హీరోలు అనగానే డైరెక్టర్ తో పాటుగా తనకూ కొంచెం టెన్షన్ వచ్చిందని.. అయితే తమకు ఎలాంటి టెన్షన్ ఇవ్వకుండా ముగ్గురు హీరోలు బ్రదర్స్ లాగా వాళ్లకు వాళ్లే చక్కగా మ్యానేజ్ చేసుకున్నారని తెలిపారు. డైరెక్టర్ విజయ్ చాలా పర్ఫెక్షనిస్ట్ అని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అనుకున్న టైం లో సినిమాని చాలా అద్భుతంగా తీశారన్నారు. కో ప్రొడ్యుసర్ శ్రీధర్ అన్ని దగ్గరుండి చూసుకున్నారని చెప్పారు. శ్రీ చరణ్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని, సినిమాలో బిజిఎం చాలా అద్భుతంగా ఉంటుందని రాధా మోహన్ తెలిపారు. ఇక 'భైరవం' చిత్రంలో 8 పాటలు ఉన్నాయని మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ వెల్లడించారు. సినిమాలో తాను కంపోజ్ చేసిన కాలభైరవ స్తోత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని నిర్మాత శ్రీధర్ చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ అదితి శంకర్, కీలక పాత్ర పోషించిన డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా పాల్గొన్నారు.