Begin typing your search above and press return to search.

పవర్‌ఫుల్‌గా ‘భైరవం’ టీజర్‌.. పూనకంతో ఊగిపోయిన బెల్లంకొండ..!

లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేయగా.. ఫస్ట్ సింగిల్ వచ్చిన 'ఓ వెన్నెల' సాంగ్ అలరించింది.

By:  Tupaki Desk   |   20 Jan 2025 12:09 PM GMT
పవర్‌ఫుల్‌గా ‘భైరవం’ టీజర్‌.. పూనకంతో ఊగిపోయిన బెల్లంకొండ..!
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''భైరవం''. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచే మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేయగా.. ఫస్ట్ సింగిల్ వచ్చిన 'ఓ వెన్నెల' సాంగ్ అలరించింది. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా టీజర్ ను లాంచ్ చేసింది.


''రాత్రి నాకొక కల వచ్చింది.. చుట్టూ తెగి పడిన తలలు మొండాలు.. దూరంగా మృత్యు తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడురా శీను..'' అంటూ జయసుధ చెప్పే వాయిస్ ఓవర్ తో 'భైరవం' టీజర్ ప్రారంభమవుతుంది. సుమారు ఒకటిన్నర నిమిషం నిడివితో కట్ చేసిన యాక్షన్-ప్యాక్డ్ మాస్ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ''ఈ ఊరిని కాపాడటానికి వారాహి అమ్మవారు.. ఆ అమ్మ గుడిని కాపాడటానికి నానమ్మ ఉండగా మాకు ఏమవుతుంది'' అని నారా రోహిత్ అంటుండగా.. ''శీనుగాడి కోసం నా ప్రాణాలిస్తా, వాడి జోలికి ఎవరైనా వస్తే ప్రాణాలు తీస్తా'' అని మంచు మనోజ్ అంటున్నాడు.

''ఆ రామ లక్ష్మణులను సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే.. ఈ రామలక్ష్మణులకు ఏ కష్టం రాకుండా చూసుకోడానికి ఈ శీనుగాడు ఉన్నాడు'' అంటూ సాయి శ్రీనివాస్‌ చెప్పే పవర్‌ ఫుల్‌ డైలాగ్ తో ఈ టీజర్ ముగుస్తుంది. ఒక ఊరు, అందులోని వారాహి గుడి నేపథ్యంలో.. శ్రీను, వరద, గజపతి అనే ముగ్గురు పాత్రల అనుబంధం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌ ని బట్టి అర్థమవుతోంది. ఇందులో రామలక్ష్మణులుగా నారా రోహిత్, మంచు మనోజ్.. వారికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఆంజనేయుడిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ను చూపించారు.

సాయి శ్రీనివాస్‌, నారా రోహిత్, మంచు మనోజ్ లు ఇంతముందెన్నడూ చూడని మాస్ లుక్ లో, తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. జయసుధ, అజయ్, డైరెక్టర్ సందీప్ రాజ్, సంపత్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. హై ఆక్టేన్ యాక్షన్, డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ మిశ్రమంగా 'భైరవం' ఉంటుందని తెలుస్తోంది. దీంట్లో యాక్షన్ పాళ్ళు కాస్త ఎక్కువే అని హింట్ ఇచ్చారు. టీజర్ చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ పూనకం వచ్చినట్లు ఊగిపోయే సీన్ హైలైట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సత్యర్షి, తూమ్ వెంకట్ రాసిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

'గరుడన్' అనే తమిళ చిత్రానికి రీమేక్ గా 'భైరవం' తెరకెక్కుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చగా.. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ మాస్టర్స్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు. ''భైరవం'' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.