Begin typing your search above and press return to search.

'హైందవ' పవర్ఫుల్ గ్లింప్స్.. కంటెంట్ గట్టిగానే..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది.

By:  Tupaki Desk   |   8 Jan 2025 12:32 PM GMT
హైందవ పవర్ఫుల్ గ్లింప్స్.. కంటెంట్ గట్టిగానే..
X

హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు. భారీ హంగులతో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు 'హైందవ' అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దర్శకుడు లూధీర్ బైరెడ్డి అండ్ టీమ్ తాజాగా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. మూన్షైన్ పిక్చర్స్ నిర్మాణంలో మహేష్ చందు సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా కథ దశావతారాల ప్రాశస్త్యంతో కూడిన పురాతన ఆలయ చుట్టూ తిరుగుతుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించింది. సీరియస్ గా ప్రారంభమైన గ్లింప్స్‌ లో ఓ అడవిలోని దశావతారాల ఆలయాన్ని నాశనం చేయడానికి దుండగులు ప్రయత్నించే సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సింహం, అడవి పంది వెంట తోడుగా రైడ్ చేస్తూ, గరుడం ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తారు.

ఈ సన్నివేశానికి సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌లో కూడా విశిష్టమైన చిహ్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలయ కుంటలోని చేపలు ఉగ్రరూపంతో పైకి లేచిన సందర్భం, ఆలయానికి ఆవల తాబేలు దృష్టి నిలిపిన షాట్స్ కూడా అద్బుతంగా ఉన్నాయి. హీరో చేతిపై ఉన్న ఆదిశేషుడి గుర్తు ఆలయంలోని చిహ్నాలతో పోలి ఉండటం గమనార్హం. బెల్లంకొండ తన సాహసాలతో ఆలయాన్ని రక్షిస్తూ శత్రువులపై తిరగబడిన తీరు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.

ప్రత్యేకంగా దగ్ధమైన ఎద్దుల బండిని బ్యాడ్ గైస్‌ను చుట్టేసి, ఆ అగ్నిజ్వాలలు విష్ణు నామాలు రూపంలో ఆవిర్భవించే తీరు సినిమా కంటెంట్ ను తెలియజేస్తుంది. గాంబిరంగా ప్రతిబింబించేలా ఉన్న సింహం, అడవి పంది ముఖాల్లో కూడా విష్ణు నామాలు హైలెట్ అయిన విధానం కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. చివరిగా ఆకాశంలో విష్ణువుల రూపాలను చూపించిన సమయంలో ‘హైందవ’ అనే శక్తివంతమైన టైటిల్‌ను హైలెట్ చేశారు.

ఈ టైటిల్ వెనుక భక్తి, వైభవం, పవర్ ఉన్నట్లు హిందుత్వ సారాన్ని వ్యక్తం చేస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాస్త గడ్డం, మీసాలతో కనిపించిన ఈ మోస్ట్ రగ్డ్ లుక్‌కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. హీరో పవర్ఫుల్ లుక్, శివేంద్ర కెమెరా వర్క్‌తో ప్రతి ఫ్రేమ్ మరింత అద్భుతంగా ఉంది. లియోన్ జేమ్స్ సంగీతం ఈ గ్లింప్స్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చేసింది. అందులో రామ, కృష్ణ చరణాలు కూడా ఎట్రాక్ట్ చేశాయి.

దర్శకుడు లూధీర్ బైరెడ్డి తన తొలి ప్రయత్నంలోనే విశేష శ్రద్ధ కనబర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మూన్షైన్ పిక్చర్స్ భారీ నిర్మాణ విలువలు, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనగేంద్ర టంగాల, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ కృషి ఈ సినిమాకు ప్రత్యేకమైన హైప్ ను తీసుకొచ్చాయి. ఇప్పటికే 35% షూటింగ్ పూర్తి కాగా, ఈ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. 'హైందవ' టైటిల్ గ్లింప్స్ విడుదలతో ఆడియెన్స్ లో భారీ ఆసక్తి నెలకొంది. కంటెంట్ ఏదో కొత్తగా మిస్టరీ అంశాలతో ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో బెల్లంకొండ ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.