Begin typing your search above and press return to search.

వచ్చే ఏడాది మా వాడి పెళ్లి

టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రముఖ హీరోలతో సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్‌ కొన్ని ఆర్థికపరమైన ఇష్యూల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 10:07 AM GMT
వచ్చే ఏడాది మా వాడి పెళ్లి
X

టాలీవుడ్‌లో ఒకప్పుడు ప్రముఖ హీరోలతో సినిమాలను నిర్మించిన బెల్లంకొండ సురేష్‌ కొన్ని ఆర్థికపరమైన ఇష్యూల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. నిర్మాణంకు దూరంగా ఉన్నా ఆయన ఇద్దరు కొడుకులను హీరోలుగా పరిచయం చేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, బెల్లంకొండ సాయి గణేష్‌లు ఇద్దరూ హీరోలుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటూ ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తి ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ 'బైరవం' సినిమాతో పాటు టైసన్ నాయుడు సినిమాను చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఆ సినిమాలు రాబోయే ఏడాది కాలంలో విడుదల కాబోతున్నాయి. తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, తన వారసులు, తన ఫ్యూచర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరిగి తాను సినిమాల నిర్మాణంలో అడుగు పెట్టబోతున్నట్లుగా బెల్లంకొండ సురేష్ ప్రకటించారు. అంతే కాకుండా తన వారసులకు పెళ్లి చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

సురేష్ మాట్లాడుతూ... మా పెద్దబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి పెళ్లి సెట్‌ అయ్యింది. అరేంజ్డ్‌ మ్యారేజ్‌ వచ్చే ఏడాది ఉంటుంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్న మా వాడు వచ్చే ఏడాది ఆ నాలుగు సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక మీదట వరుసగా సినిమాలతో వస్తాడు. ఏడాదికి మూడు సినిమాలు అయినా చేయాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది పెళ్లితో పాటు వరుసగా సినిమాలతో రాబోతున్న మా వాడికి హిట్‌ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

యాక్షన్‌ సినిమాలతో పాటు లవ్‌ కమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సినిమాల్లోనూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ని ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారు. భైరవంలో మరోసారి యాక్షన్‌ హీరోగానే బెల్లంకొండ బాబు కనిపించబోతున్నారు. ముందు ముందు అయినా ఆయన నుంచి వినోదాన్ని ప్రేక్షకులు చూస్తారేమో చూడాలి. చత్రపతి హిందీ రీమేక్‌తో బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి హిట్ దక్కి చాలా ఏళ్లు అవుతోంది. మరి 2024లో అయినా బెల్లంకొండకి హిట్‌ పడేనా చూడాలి.