నిర్మాత ఫ్లాప్ అన్నాడు.. కానీ ఎన్టీఆర్ మాత్రం..!
ఎన్టీఆర్ సినిమా విషయంలో అదే జరిగిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 7 Dec 2024 5:10 AM GMTకొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నప్పుడే వాటి ఫలితాన్ని గెస్ చేస్తారు మేకర్స్. కాంబినేషన్ సరిగా కుదరకనో లేదా అనుకున్న కథ తెర మీద సరిగా రాకపోవడం వల్లనో కానీ కొన్ని సినిమాలు రిలీజ్ ముందే షూటింగ్ సమయంలోనే ఇది వర్క్ అవుట్ అవ్వడం కష్టమని అనిపిస్తుంది. ఆ టైం లో నిర్మాత డబ్బులు పెట్టడం వృధా అనుకుంటాడు. ఐతే ఒక్కోసారి వారి అంచనాలు రాంగ్ అని ప్రూవ్ అవుతాయి. ఎన్టీఆర్ సినిమా విషయంలో అదే జరిగిందని నిర్మాత బెల్లంకొండ సురేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈమధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు కానీ తనయులిద్దరినీ హీరోలుగా చేశారు. ఐతే ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో చేసిన రభస సినిమా గురించి ప్రస్తావించారు సురేష్. అప్పటికే కందిరీగతో హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ హీరోగా రభస మొదలు పెట్టాం. కానీ సినిమా మధ్యలోనే పోతుందని అనిపించింది. ఆపేద్దామని కూడా అనుకున్నానని అన్నారు సురేష్. ఐతే ఎన్టీఆర్ మాత్రం సినిమా ఆడుతుందని చెప్పి పూర్తి చేయించారు.
ఐతే రిజల్ట్ చూసి తాను షాక్ అయ్యానని అన్నారు. తాను పోతుంది అనుకున్న సినిమా ఎబో యావరేజ్ గా నిలిచింది. సినిమాకు పెట్టిన దానిలో 90 శాతం రికవరీ అయ్యింది. ఐతే అది ఎన్టీఆర్ స్టామినా వల్లే సాధ్యమైందని అన్నారు. ఎన్టీఆర్ కాకుండా వేరే హీరో అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యేదని అన్నారు. స్టార్ సినిమాలు కాస్త అటు ఇటుగా ఉన్నా ఒక్కోసారి వర్క్ అవుట్ అవుతాయి. ఐతే సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ క్రేజ్ ని సరిగా వాడుకోలేదన్న కామెంట్స్ అయితే రభస సినిమా టైంలో వచ్చాయి.
రభస డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కు అవకాశాలు లేవు. నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా సినిమాలు తీయడం ఆపేశారు. సురేష్ కొడుకులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, గణేష్ ఇద్దరు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అతను రెండు భారీ సినిమాలతో వస్తున్నారు. మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఒక మంచి మాస్ హిట్ పడితే మాత్రం నిలదొక్కుకున్నట్టే అవుతుంది.