Begin typing your search above and press return to search.

బెల్లంకొండ 'ఆట మొదలైంది'

విభిన్నమైన టైటిల్స్ ని ఎంపిక చేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ఆట మొదలైంది అనే టైటిల్ తో రావడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:20 AM GMT
బెల్లంకొండ ఆట మొదలైంది
X

హిట్‌ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకు పోతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్తగా మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే చేస్తున్న సినిమాలకు తోడు మా ఊరి పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఒక సినిమాని చేసేందుకు బెల్లంకొండ బాబు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు, కిష్కింద పురి సినిమాలతో పాటు మరో సినిమాను లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో హైందవ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ఏడాది కనీసం ఒక్క సినిమాతో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అనిల్‌ విశ్వనాథ్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించబోతున్న శ్రీనివాస్ చిట్టూరి ఇప్పటికే 'ఆట మొదలైంది' అనే టైటిల్‌ ను రిజిస్టర్‌ చేయించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడట.

విభిన్నమైన టైటిల్స్ ని ఎంపిక చేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి ఆట మొదలైంది అనే టైటిల్ తో రావడం దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ఆట మొదలు పెట్టేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు కావచ్చు.

మొత్తానికి బెల్లంకొండ కెరీర్‌ ఆరంభం నుంచి కూడా సినిమాల ఎంపిక విషయంలో, స్పీడ్‌ విషయంలో ఇతర యంగ్‌ హీరోలను ఆశ్చర్యపరుచుతూనే ఉన్నాడు. తాజాగా కొత్త సినిమాకు కమిట్‌ అవ్వడం, రాబోయే ఏడాది కాలంలో బ్యాక్ టు బ్యాక్‌ బెల్లంకొండ సినిమాలతో రావడం కన్ఫర్మ్‌ అయ్యింది.