Begin typing your search above and press return to search.

బెల్లంకొండ నాయుడి వామన కిష్కిందపురి..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్‌ ఫెయిల్యూర్‌ లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 12:30 AM GMT
బెల్లంకొండ నాయుడి వామన కిష్కిందపురి..!
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్‌ ఫెయిల్యూర్‌ లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. టాలీవుడ్‌ లోనే కిందా మీదా పడుతూ సక్సెస్‌ కోసం ప్రయత్నాలు చేసిన బెల్లంకొండ బాబు ఆ మధ్య బాలీవుడ్‌ లో సినిమా చేసి గట్టి దెబ్బ తిన్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. రాబోయే ఏడాది కాలంలో ఈ మూడు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటగా భీమ్లా నాయక్‌ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాతో రాబోతున్నాడు.

14 రీల్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీగా టైసన్‌ నాయుడు రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. త్వరలోనే ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరో వైపు కొత్త దర్శకుడు లుదీర్‌ తో సాయి శ్రీనివాస్ ఒక సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమాకు వామన అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే అధికారికంగా ఒక పోస్టర్‌ ను విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వామన సినిమాతో పాటు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఒక ఫాంటసీ సినిమాను కూడా చేసేందుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓకే చెప్పాడు. ఆ సినిమాకు కిష్కిందపురి అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారట. మొత్తానికి మూడు విభిన్నమైన టైటిల్స్ ను ఖరారు చేయడం ద్వారా విడుదలకు ముందే బజ్ క్రియేట్‌ చేస్తున్నాయి.

ఈమూడు సినిమాలు అయినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి సక్సెస్ ను కట్టబెట్టేనా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అందుకే కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాలు చేస్తున్నాడట.