బెల్లంకొండవి గొప్ప రికార్డులే… కానీ
బెల్లంకొండ శ్రీనివాస్ కి మరో అరుదైన గుర్తింపు ఉంది. అతని సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ వస్తూ ఉంటుంది.
By: Tupaki Desk | 22 Feb 2024 4:10 AM GMTతెలుగులో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోన్న నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కమర్షియల్, యాక్షన్ కథలతో, భారీ బడ్జెట్ తో మూవీస్ చేస్తూ తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అతని కెరియర్ లో చేసిన కొన్ని సినిమాలు బాగున్నాయనే టాక్ వచ్చిన కూడా బడ్జెట్ లు ఎక్కువ కావడంతో కమర్షియల్ గా సక్సెస్ లు సాధించినవి తక్కువ అని చెప్పాలి.
బెల్లంకొండ శ్రీనివాస్ కి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన మూవీ అంటే రాక్షసుడు మాత్రమే. ఆయన నటించిన జయ జానకీ నాయకా, సాక్ష్యం బాగానే ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కి మరో అరుదైన గుర్తింపు ఉంది. అతని సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ వస్తూ ఉంటుంది.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై డబ్బింగ్, స్ట్రైట్ హిందీ సినిమాల పరంగా అత్యధిక వ్యూవ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా కవచం మూవీ నిలిచింది. ఈ సినిమా యుట్యూబ్ లో డిఫరెంట్ ఛానల్స్ లో మొత్తం 830 మిలియన్స్ వ్యూవ్స్ కలిగి ఉంది. ఈ స్థాయిలో ఏ ఇతర ఇండియన్ మూవీ కూడా వ్యూవ్స్ సొంతం చేసుకోలేదు. అలాగే జయ జానకీ నాయకా సినిమాకి 800 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. డిజాస్టర్ మూవీ సీతకి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
యుట్యూబ్ లో వ్యూవ్స్ పరంగా తన సినిమాలతో బెల్లంకొండ శ్రీనివాస్ రికార్డులు సృష్టించాడు. తన సినిమాలకి నార్త్ లో విపరీతమైన ఆదరణ ఉందని, తనకి అక్కడ ఈజీగా సక్సెస్ వస్తుందని అనుకోని హిందీలో ఛత్రపతి మూవీ రీమేక్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిందీ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 80 కోట్ల వరకు సినిమాకి ఖర్చు పెడితే అందులో కనీసం 10 శాతం కూడా రికవరీ రాలేదు.
ఈ సినిమా రిజల్ట్ తో ఒకటైతే స్పష్టం అయ్యింది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలని యుట్యూబ్ లో ఫ్రీగా చూడటానికి మాత్రమే ఇష్టపడతారు. టికెట్ కొనుక్కొని థియేటర్స్ కి వెళ్లి 2 గంటలు టైం స్పెండ్ చేసి చూడరు. కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే కాకుండ సౌత్ ఇండియన్ యాక్షన్ మూవీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కి యుట్యూబ్ లో మాత్రమే ఆదరణ ఉంటుందని క్లారిటీ వచ్చింది.