బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్ళీ కెరీర్ సెట్ చేసుకునేలా..
కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్న టాలీవుడ్ లో టైర్ 2 హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 9 April 2024 12:03 PM GMTబడా నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కమర్షియల్ హీరోగా నిలబడ్డ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శ్రీను నుంచి చివరిగా వచ్చిన రాక్షసుడు వరకు మేగ్జిమమ్ హీరో ఇమేజ్ బేస్డ్ గా నడిచే కమర్షియల్ సినిమాలే వచ్చాయి. వాటిలో కొన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్న టాలీవుడ్ లో టైర్ 2 హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
సరైన యాక్షన్ బేస్డ్ స్టోరీ పడితే బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ని చూడొచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ చివరిగా రాక్షసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తరువాత హిందీ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలనే ప్రయత్నం చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమాని అదే పేరుతో వివి.వినాయక్ హిందీలో రీమేక్ చేశారు. అయితే ఆ సినిమా హిందీలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది.
దీంతో కొంత గ్యాప్ తీసుకొని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. ఆ సినిమాకేజ్ టైసన్ నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఉగాది సందర్భంగా ఫ్యాన్స్ కి విషెస్ చెబుతూ తన కొత్త సినిమాలకి సంబందించిన అప్డేట్స్ ఇచ్చారు.
ప్రొఫెషనల్ లైఫ్ లో నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ ప్రయత్నంలో నాకు తోడుగా ఉన్న అందరికి కృతజ్ఞతలు అంటూ శ్రీనివాస్ తెలియజేశాడు. తన నుంచి తెలుగులో మూవీ వచ్చి మూడేళ్లుఅవుతుంది. ఈ ఏడాది కొత్త సినిమాలతో మరల మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను.
టైసన్ నాయుడు సినిమా షూటింగ్ దశలో ఉంది. దీంతో పాటు షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే మూన్ షైన్ ప్రొడక్షన్ లో కూడా ఒక మూవీ ఉండబోతోంది. వీటి గురించి త్వరలో పూర్తి వివరాలు బయటకి వస్తాయి అని బెల్లంకొండ శ్రీనివాస్ లెటర్ లో పేర్కొన్నారు. టైసన్ నాయుడు తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ చేయబోయే రెండు సినిమాలకి దర్శకులు ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు.
అయితే బెల్లంకొండ బాబు కచ్చితంగా ఈ సినిమాలు కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతోనే చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. ఇక ఛత్రపతి రీమేక్ తరువాత బెల్లంకొండ హిందీలో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ టాలీవుడ్ వైపే యూ టర్న్ తీసుకున్నాడు. మరి రాబోయే సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.