Begin typing your search above and press return to search.

దూసుకొస్తున్న యువ కెర‌టం!

'రాక్ష‌సుడు' వ‌ర‌కూ బెల్లంకొండ శ్రీనివాస్ జ‌ర్నీ ఎలా సాగిందో తెలిసిందే. అప్ప‌టికే ఐదారు సినిమాలు చేసాడు

By:  Tupaki Desk   |   10 April 2024 7:28 AM GMT
దూసుకొస్తున్న యువ కెర‌టం!
X

'రాక్ష‌సుడు' వ‌ర‌కూ బెల్లంకొండ శ్రీనివాస్ జ‌ర్నీ ఎలా సాగిందో తెలిసిందే. అప్ప‌టికే ఐదారు సినిమాలు చేసాడు. వాటిలో రెండు..మూడు యావ‌రేజ్ గా ఆడ‌టం మిన‌హా త‌క్కిన చిత్రాల్ని ప‌ర‌జాయాన్నే అందుకున్నాయి. 'రాక్ష‌సుడు' అత‌డి మొత్తం కెరీర్ లోనే ఇప్ప‌టికీ తొలి హిట్ గా క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత శ్రీనివాస్ చేసింది కేవలం రెండు సినిమాలే. అవే 'అల్లుడు అదుర్స్' చేసిన త‌ర్వాత 'ఛ‌త్ర‌ప‌తి' హిందీలో రీమేక్ చేసి హిట్ అందుకోవాల‌నుకున్నాడు. కానీ ప‌న‌వ్వలేదు.

ఆ సినిమా రిలీజ్ అయి ఏడాది స‌మీపిస్తుంది. దీంతో ఇండ‌స్ట్రీలో సాయి వేగం త‌గ్గింద‌నే విమ‌ర్శ‌లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి. అయితే వాట‌న్నింటికి చెక్ పెట్టేలా శ్రీనివాస్ సిద్దమ‌వుతున్నాడు. ఇప్ప‌టికే 'టైస‌న్ నాయుడు'లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. సాగ‌ర్. కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఇత‌నికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఇన్నోవేటివ్ ఐడియాలతో సినిమాలు చేయ‌డం సాగ‌ర్ ప్ర‌త్యేక‌త‌. దీంతో బెల్లంకొండ‌ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేస్తాడు? అన్న అంచ‌నాలు బాగానే ఉన్నాయి.

తాజాగా షైన్ స్క్రీన్ నిర్మాణంలోనూఓ సినిమాను మూన్ షైన్ పిక్చర్స్ సంస్థ‌లోనూ మ‌రో సినిమా క‌మిట్ అయిన‌ట్లు స‌మాచారం. దీంతో బెల్లంకొండ చేతిలో రెడీగా మూడు సినిమాలున్న‌ట్లు తెలుస్తోంది. అయితే క‌మిట్ అయిన ఈ రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించేది? ఎవ‌రు ? అన్న‌ది ఇంత వ‌ర‌కూ క‌న్ప‌మ్ కాలేదు. ఈ మూడు సినిమాల‌కు శ్రీనివాస్ కి మంచి కంబ్యాక్ లా నిలుస్తాయ‌ని కుటుంబ స‌భ్యులు భావిస్తున్నారు. శ్రీనివాస్ ని పెద్ద హీరో చేయాల‌ని నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎంతో సీనియస్ గా ప్ర‌య‌త్నిస్తున్నారు.

కుమారుడిని 'ధూమ్' హీరో హృతిక్ రోష‌న్ రేంజ్ లో చూడాల‌ని....అలాంటి క‌థ‌లు చేయాల‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ శ్రీనివాస్ ఇంకా నిల‌దొక్కుకునే ప్రాస‌స్ లోనే ఉన్నాడు. హీరో క‌టౌట్ అయినా? స‌రైన హిట్లు ప‌డ‌క‌పోవ‌డంతో రేసులో వెనుక‌బ‌డిపోతున్నాడు. త‌న‌క‌న్నా వెన‌కొచ్చిన వారంతా ముందుకెళ్లిపోతున్నారు. కానీ శ్రీనివాస్ ప్ర‌య‌త్నాలు మాత్రం ఫ‌లించ‌డం లేదు. మ‌రి 2024 లోనైనా స‌క్సెస్ దిశ‌గా అడుగులు వేస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి.