Begin typing your search above and press return to search.

బెల్లంకొండ.. మరోసారి హై వోల్టేజ్ యాక్షన్ డోస్

మరోసారి బెల్లంకొండ హీరో హై వోల్టేజ్ యాక్షన్ ను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 May 2024 2:00 PM GMT
బెల్లంకొండ.. మరోసారి హై వోల్టేజ్ యాక్షన్ డోస్
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో "టైసన్ నాయుడు" అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నారు. అతనికి ఇది పదవ సినిమా. ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నటించనున్నారు. మైక్ టైసన్ అభిమానిగా ఒక బాక్సింగ్ ప్రియుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని పోస్టర్లు మంచి క్రేజ్ అందుకున్నాయి. మరోసారి బెల్లంకొండ హీరో హై వోల్టేజ్ యాక్షన్ ను హైలెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.


రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభమైంది. ఈ రెండు వారాల షెడ్యూల్‌లో టీమ్ ఒక అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ను మరియు కొన్ని టాకీ భాగాలను షూట్ చేయనుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుందని తెలుస్తోంది, సినిమాలో ఒక కీలక సమయంలో వచ్చే ఆ ఫైట్ కు ఆడియెన్స్ షాక్ అవ్వడం పక్కా అని ఒక టాక్ వినిపిస్తోంది.

సాయి శ్రీనివాస్ ఈ యాక్షన్ సీన్స్‌లో కొన్ని ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని తెలుస్తోంది. స్టంట్ శివా పర్యవేక్షణలో జరుగుతున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ రాత్రి సమయంలో 10 రోజులు పాటు షూట్ చేస్తున్నారు. మిగతా రోజుల్లో సాయి శ్రీనివాస్ మరియు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే టాకీ భాగాలను షూట్ చేయనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ మరియు ఇతర తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట మరియు గోపీ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు, ముకేష్ జ్ఞానేశ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను చేపడుతున్నారు.

"టైసన్ నాయుడు" చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఏర్పడిన అంచనాలు మరింతగా పెరిగాయి. మైక్ టైసన్ అభిమానిగా బాక్సింగ్‌ను ప్రియించే ఒక పోలీస్ అధికారిగా సాయి శ్రీనివాస్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి. ఇక బెల్లంకొండ మరో రెండు సినిమాలను లైమ్ లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. అందులో రాక్షసుడు సీక్వెల్ కూడా ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులపై కూడా అప్డేట్స్ రానున్నాయి.