ఆస్కార్ ప్రోగ్రామ్ కి బెంగుళూరు బ్యూటీ!
చాలా కాలం పాటు భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డు అనేది అందని ద్రాక్షగానే ఉండేది
By: Tupaki Desk | 12 Jun 2024 9:40 AM GMTచాలా కాలం పాటు భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డు అనేది అందని ద్రాక్షగానే ఉండేది. కానీ `ఆర్ ఆర్ ఆర్ `దీన్ని బ్రేక్ చేసింది. `నాటు నాటు` పాటకు ఆస్కార్ వరించడంతో భారత్ పేరు ప్రపంచంలో మరోసారి మారుమ్రోగింది. అందులోనూ తెలుగు సినిమా ఆస్కార్ తేవడంతో టాలీవుడ్ సత్తా విశ్వ వ్యాప్తమైంది. అంతకుముందు చాలా సినిమాలకు ఆస్కార్ కి నామినేషన్ వరకూ వెళ్లాయి.
కానీ అవార్డు తెచ్చింది లేదు. అలా `ఆర్ ఆర్ ఆర్` అన్ని రకాలుగానూ చరిత్ర సృష్టించింది. ఇదే సినిమాకి ఆస్కార్ అకాడమీలోనూ ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు కూడా దక్కాయి. తాజాగా బెంగుళూరుకు చెందిన లేడీ సినిమాటోగ్రాఫర్ ఆస్కార్ ఆకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్ కి ఎంపికైంది. ప్రస్తుతం బెంగుళూరుకు చెందిన నేత్ర గురూజీ అనే యువతి లాస్ ఏంజెల్స్ లో ఉంటుంది. ఆమె రైటర్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా పలు విభాగాల్లో పనిచేసింది.
ఈ నేపథ్యంలో నేత్ర కొన్నాళ్ల క్రితమే సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ కి వెళ్లింది. ఇటీవలే ఆమె తీసిన `జాస్మిన్ ప్లవర్స్` షార్ట్ ఫిల్మ్ పలు ఫిలిం అవార్డులను గెలుచుకుంది. ఆ షార్ట్ ఫిలిం అమెని ఆస్కార్ వరకూ తీసుకెళ్లింది. అందులో ఆమె ట్యాలెంట్ ని మెచ్చి అకాడమీ తరుపున గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్ కి ఎంపిక చేసారు. ఎంతో మంది ఈ ప్రోగ్రామ్ కి ఎంపికయ్యారు.
వాళ్లంతా రెండు నెలలు పాటు అకాడమీ ఆధ్యర్యంలో ప్రోఫెషనల్స్ దగ్గర నుంచి టెక్నిక్ లు నేర్చుకుంటారు. ఇలాంటి ప్రోగ్రామ్ కి భారత్ కి చెందిన అమ్మాయి ఎంపిక అవ్వడం గర్వకారణం. ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే దేశానికి మరింత గౌరవం, గుర్తింపు దక్కుతాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.