20 ఏళ్ళ కుర్రాడికి ఛాన్స్ ఇచ్చిన లోకేష్
కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసుకున్నాడు.
By: Tupaki Desk | 5 Nov 2024 9:30 AM GMTకోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసుకున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో లోకేష్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కోసం ఇప్పుడు నిర్మాతగా కూడా మారాడు. ఓ వైపు దర్శకుడిగా మూవీస్ చేస్తూనే మరో వైపు టాలెంటెడ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నాడు.
ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కూలీ’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మరో వైపు రాఘవ లారెన్స్ తో ‘బెంజ్’ అనే సినిమాని రీసెంట్ గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాకి లోకేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి బాఖ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ దర్శకుడు శివ కార్తికేయన్ తో ‘రోమియో’, కార్తీతో ’సుల్తాన్’ సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు.
ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్న ‘బెంజ్’ ని తెరకెక్కించబోతున్నాడు. ఇదిలా ఉంటే ‘బెంజ్’ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నారని తెలుస్తోంది. 20 ఏళ్ళ సాయి అభంకర్ అనే యువ గాయకుడిని ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. అనిరుద్, జీవీ ప్రకాష్ కుమార్ తరహాలోనే సాయి కూడా కోలీవుడ్ లో మ్యూజిక్ సెన్సేషన్ అయ్యే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.
‘బెంజ్’ మూవీతో సాయి అభంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటే తరువాత పెద్ద సినిమాలు చేసే అవకాశం రావొచ్చని అనుకుంటున్నారు. ఈ సాయి అభంకర్ స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ టిప్పు కుమారుడు అని తెలుస్తోంది. తండ్రి వారసత్వం అందుకొని తాను కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే గాయకుడిగా అడుగుపెట్టిన సాయి తమిళంలో మూడు పాటలు పాడాడు.
ఇవి మంచి హిట్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ కారణంగా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. మరి ‘బెంజ్’ సినిమాతో సాయి ఏ మేరకు ప్రూవ్ చేసుకుంటాడో వేచి చూడాలి. ఈ సినిమాలో లారెన్స్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇతర క్యాస్టింగ్ ఎవరనేది త్వరలో బయటకొచ్చే అవకాశం ఉంది.