తెలుగు బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఏది?
సినిమా విజయానికి పాటలు ఎంతగా దోహదం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 24 Dec 2024 3:30 AM GMTసినిమా విజయానికి పాటలు ఎంతగా దోహదం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజుల్లో ఏదైనా సినిమాకు మంచి హైప్ రావాలంటే, రిలీజ్ కు ముందు వదిలే సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాదిలో అనేక తెలుగు సినిమా పాటలు సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. ఎస్.థమన్, అనిరుధ్ రవిచందర్, దేవిశ్రీ ప్రసాద్, సంతోష్ నారాయన్, భీమ్స్ సిసిరోలియో లాంటి సంగీత దర్శకులు ఫ్రెష్ మ్యూజిక్ ఆల్బమ్స్ ను కంపోజ్ చేసారు. 2024 చివరకు వచ్చేశాం కాబట్టి, ఈ సంవత్సరంలో స్టార్ హీరోల సినిమాల్లో బెస్ట్ ఆల్బమ్ ఏదో ఇప్పుడు చూద్దాం.
'గుంటూరు కారం' - ఎస్. థమన్:
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ''గుంటూరు కారం''. ఎస్. థమన్ ఈ చిత్రానికి మంచి ఆల్బమ్ అందించారు. 'ధమ్ మసాలా', 'ఓ మై బేబీ', 'మావా ఎంతైనా', 'కుర్చీ మడతబెట్టి', 'రమణ ఎయ్', 'అమ్మ' సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. వాటిల్లో 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. ఇప్పటికీ రోజూ ఎక్కడో చోటు వినిపిస్తూనే ఉంటుంది. మిగతా పాటలు ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌లు కానప్పటికీ, సినిమా రిలీజైన తర్వాత జనాలకు బాగా ఎక్కాయి. ఈ ఏడాది అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లోనూ ట్రెండింగ్ లో కొనసాగాయి.
'కల్కి 2898 ఏడీ' - సంతోష్ నారాయన్:
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ 'కల్కి 2898 ఏడీ'. తమిళ మ్యూజిక్ కంపోజర్ సంతోష్ నారాయన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఇందులో 'భైరవ ఆంథెమ్', 'టా టక్కర', 'థీమ్ ఆఫ్ కల్కి', 'వీర ధీర', 'శంబాల' 'కేశవ మాధవ' వంటి పాటలు ఉన్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఫ్రెష్ ట్యూన్స్ కంపోజ్ చేసారు. కానీ ఇవేవీ సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవ్వలేదు.
'దేవర 1' - అనిరుధ్ రవిచందర్:
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా 'దేవర 1'. దీనికి అనిరుధ్ రవిచందర్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ సమకూర్చారు. 'ఫియర్ సాంగ్', 'చుట్టమల్లే', 'దావుడి', 'ఆయుధ పూజ' వంటి వేటికవే ప్రత్యేకమైన నాలుగు పాటలు ఉన్నాయి. ఇవన్నీ రిలీజైన వెంటనే ఇన్స్టెంట్ గా హిట్ అయ్యాయి. కొన్ని నెలల పాటు సోషల్ మీడియాని షేక్ చేసాయి. నిజానికి సినిమా విజయంలో ఈ మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషించాయని చెప్పాలి.
'పుష్ప 2' - దేవిశ్రీ ప్రసాద్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ సినిమా 'పుష్ప 2: ది రూల్'. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 'పుష్ప పుష్ప', 'సూసేకి', 'కిస్సిక్', 'పీలింగ్స్', 'గంగో రేణుకో తల్లి' వంటి ఐదు పాటలు ఉన్నాయి. వాటిల్లో టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిగతా పాటలు రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత వెంట వెంటనే రిలీజ్ చెయ్యడంతో పెద్దగా వైరల్ అవ్వలేదు. కానీ మూవీ రిలీజైన తర్వాత శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి.
'గేమ్ ఛేంజర్' - థమన్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఎస్. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇప్పటి వరకూ 'జరగండి', 'రా మచ్చా మచ్చా', 'నానా హైరానా', 'ధోప్ సాంగ్' వంటి నాలుగు పాటలను రిలీజ్ చేసారు. వీటికి యూట్యూబ్ లో వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ, సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవ్వలేదు. శంకర్ సాంగ్స్ విజువల్ గ్రాండియర్ గా ఉంటాయి. కాబట్టి బిగ్ స్క్రీన్ మీద ఈ పాటలు బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. సినిమాలో మిగిలిన పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాయి. ఇవి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటాయో చూడాలి.
స్టార్ హీరోల సినిమాలను పక్కన పెడితే ఈ ఏడాదిలో వచ్చిన కొన్ని పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ''టిల్లు స్క్వేర్'' సినిమాలోని 'టికెట్టే కొనకుండా', 'రాధిక', 'డీజే టిల్లు రీవ్యాప్' వంటి పాటలు బాగా ట్రెండ్ అయ్యాయి. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలోని 'సుట్టమల్లె సూసి'.. 'ఊరి పేరు భైరవకోన' మూవీలోని 'నిజమేనే', 'నా వల్ల కాదే బొమ్మ' పాటలు జనాలను థియేటర్లకు రప్పించాయి. 'జనక అయితే గనుక' చిత్రంలో 'నా ఫేవరేట్ నా పెళ్ళాం'.. 'డబుల్ ఇస్మార్ట్' లోని 'స్టెప్పా మార్' సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. 'లక్కీ భాస్కర్' మూవీలోని 'శ్రీమతి గారు' గీతానికి అనూహ్య స్పందన లభించింది. రీసెంట్ గా వచ్చిన 'తండేల్' లోని 'బుజ్జి తల్లి' పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ రీల్స్ కనిపిస్తున్నాయి. 'డాకు మహారాజ్' మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్.. 'సంక్రాంతికి వస్తున్నాం' రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి.