బుల్లితెర షోను సినిమాగా తెరకెక్కిస్తున్న హీరో
మన్మోహన్ తివారీ పాత్ర పోషించిన నటుడు రోహితశ్వ గౌర్ ఒక ఇంటర్వ్యూలో షోను సినిమాగా తీస్తున్నామని ధృవీకరించారు.
By: Tupaki Desk | 18 Feb 2025 4:07 AM GMTబుల్లితెరపై విపరీతమైన ప్రజాదరణ పొందిన ఏదైనా టీవీ షోని సినిమాగా తీయాలనే నిర్ణయం సరైనదేనా? ఏమో! ఈ నిర్ణయం ఎంతవరకూ సఫలమవుతుందో చెప్పలేం కానీ, ఇప్పుడు భాబీ జీ ఘర్ పర్ హై! అనే బుల్లితెర కామెడీ షోని తిరిగి వెండితెరపై చూపించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం నడిచిన కామెడీ షోలలో భాబీ జీ ఘర పర్ హై ఒకటి. 2015లో విడుదలైన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ ఇప్పటికీ భారతదేశంలోని ముఖ్యంగా ఉత్తరాది ప్రజలను అలరిస్తూనే ఉంది.
జోకులు సెటైర్లు పంచ్ లు అంటూ సాగే ఈ షో చాలా ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటికే బాగా పాతబడిపోయిన ఈ షో స్ఫూర్తితో ఒక సినిమా చేయాలనుకున్నా.. 10 సంవత్సరాల షోలో నాణ్యత చాలా కిందికి పడిపోయిందన్న చర్చా ఉంది. కాబట్టి షో కంటెంట్ విషయంలో రాజీ అన్నదే లేకుండా ప్రయత్నించాల్సి ఉంటుంది.
మన్మోహన్ తివారీ పాత్ర పోషించిన నటుడు రోహితశ్వ గౌర్ ఒక ఇంటర్వ్యూలో షోను సినిమాగా తీస్తున్నామని ధృవీకరించారు. ఈ చిత్రంలో విభూతి, అనిత, అంగూరి... మన్మోహన్ మొత్తం షో బృందంతో నవ్వులు పండించే వీలుంది. ఈ షోకి దర్శకత్వం వహించిన శశాంక్ బాలి స్వయంగా సినిమాకి దర్శకత్వం వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఎపిసోడ్‌లు కొంచెం ఒకే తరహాలో కనిపిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. రిపీటెడ్ థీమ్‌లు బోర్ కొట్టిస్తున్నాయన్న వాదనా వినిపిస్తోంది. అలా కాకుండా కొత్తదనంతో ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి.